ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దారుణం: కేవలం రూ.3 వేల కోసం ఎంత పని చేశాడో చూడండి.. అసలు ఏం జరిగిందంటే..?

ABN, First Publish Date - 2023-08-02T20:53:00+05:30

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్న 3 వేల రూపాయలు తిరిగి చెల్లించలేదని 21 ఏళ్ల యువకుడిని ఓ వ్యక్తి పట్టపగటే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే బాధితుడు ప్రాణాలు విడిచాడు.

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అప్పుగా తీసుకున్న 3 వేల రూపాయలు తిరిగి చెల్లించలేదని 21 ఏళ్ల యువకుడిని ఓ వ్యక్తి పట్టపగటే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే బాధితుడు ప్రాణాలు విడిచాడు. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో బుధవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అయిన వీడియోలో ఓ దుకాణం ముందు బాధితుడిని నిందితుడు పదే పదే కత్తితో పొడవడం కనిపించింది. బాధితుడు ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతానికి చెందిన యూసుఫ్ అలీ కాగా, నిందితుడి షారుక్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మూడు, నాలుగు రోజుల క్రితం షారూక్ నుంచి యూసుఫ్ అలీ 3 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తర్వాత తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని యూసుఫ్‌ను షారూక్ అడిగాడు. కానీ యూసుఫ్ ఆలస్యం చేయడంతో షారూక్ బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే బుధవారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలోనే యూసుఫ్‌ను షారూక్ కత్తితో పదే పదే పొడిచాడు. ఈ షాకింగ్ ఘటన చూసి బిత్తరపోయిన చుట్టుప్రక్కల వారేవరూ మొదట ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత షారూక్‌ను అడ్డుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని నిందితుడు యూసుఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు షారూక్‌ను బాత్రా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే షారూక్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. జనాల దాడిలో గాయపడిన నిందితుడు యూసుఫ్‌ను కూడా ఆసుపత్రిలో చేర్చారు. బాధితుడి తండ్రి సాహిద్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302/34 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి షాహిద్ అలీ మాట్లాడుతూ.. షారుఖ్ అనే వ్యక్తి డబ్బు విషయమై తన కొడుకును బెదిరించాడని తెలిపాడు. యూసుఫ్ అలీని షారుక్ కత్తితో పొడిచి చంపాడని ఎవరో అబ్బాయి ద్వారా తనకు తెలిసిందని యూసుఫ్ తండ్రి చెప్పాడు.

Updated Date - 2023-08-02T20:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising