ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP VS TDP: నెల్లూరు జిల్లాలో దారుణం.. మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..?

ABN, First Publish Date - 2023-10-01T15:02:13+05:30

నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. వైసీపీ ప్రభుత్వ(YCP Govt) అవినీతిని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో దళిత సర్పంచ్ మందా వెంకటరమణయ్య(Manda Venkataramaniah)పై వైసీపీ మూఖలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి.

నెల్లూరు: నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. వైసీపీ ప్రభుత్వ(YCP Govt) అవినీతిని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో దళిత సర్పంచ్ మందా వెంకటరమణయ్య(Manda Venkataramaniah)పై వైసీపీ మూఖలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. వైసీపీ మూకల దాడిలో వెంకటరమణయ్యకి తీవ్రగాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆయనను జీజీహెచ్‌కి తరలించాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అల్లరి మూకలు జిల్లాలో పెను భీభత్సం సృష్టింస్తున్నాయని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ చర్యలను తెలుగుదేశం పార్టీ, జనసేన తీవ్రంగా ఖండించాయి. సర్పంచ్ మందా వెంకటరమణయ్యపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళనలను విరమించబోమని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించారు.


గోవర్ధన్‌రెడ్డికి మంత్రి కాగానే కళ్లు నెత్తికెక్కాయి..: సోమిరెడ్డి

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) సర్పంచ్ మందా వెంకటరమణయ్యను పరామర్శించి.. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Minister Kakani Govardhan Reddy), ఆయన అనుచరులని ప్రశ్నించడంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మంత్రి కాగానే కళ్లు నెత్తికెక్కాయి. మీరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే, ప్రశ్నించకూడదా? ఇప్పటి వరకు ఒక దళితుడిని, ఇద్దరు ముస్లింలని చంపేశారు. ఇంకా ఎంత మందిని చంపుతారు? మంత్రి కాకాణికి సిగ్గుండొద్దా? పోలీసుల నిర్లక్ష్యంతోనే జిల్లాలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఎస్పీ...ఇప్పటికైనా సర్వేపల్లి గురించి పట్టించుకోవాలి’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-01T15:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising