ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srinivasa Reddy: జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది

ABN, First Publish Date - 2023-08-22T17:20:09+05:30

చంద్రబాబు పర్యటన అల్లర్లలో నేను లేకున్నా కూడా ఉన్నట్లు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై పరువు నష్టం దావా వేస్తా.. న్యాయమే గెలుస్తుంది.

కడప: వైసీపీ ప్రభుత్వం (Ycp Government), పోలీసులపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy) ఫైరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు (Chandrababu) పర్యటన అల్లర్లలో నేను లేకున్నా కూడా ఉన్నట్లు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై పరువు నష్టం దావా వేస్తా.. న్యాయమే గెలుస్తుంది. పోలీసులకు వైసీపీ జీతాలు ఇస్తున్నట్లు పని చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిన ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టం. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన జరుగుతుంది. జగన్‌పై పదహారు కేసులు కేసులు ఉన్నాయి. అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం కేసు ఉంది. ఇప్పటివరకు మా కుటుంబంపై ఎలాంటి కేసులు లేవు. జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది. చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి జగన్ ఆందోళన చెందుతున్నారు.’’ అని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

Updated Date - 2023-08-22T17:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising