ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: ఏపీలో పోలీసులు జగన్‌రెడ్డికి ప్రైవేటు సైన్యంలా మారిపోయారు

ABN, First Publish Date - 2023-11-16T23:01:26+05:30

ఏపీలో కొంతమంది పోలీసులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి ప్రతిపక్షాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఆందోళనకు గురిచేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు.

అమరావతి: ఏపీలో కొంతమంది పోలీసులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి ప్రతిపక్షాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఆందోళనకు గురిచేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘రాజమండ్రి రామాలయం సెంటర్‌లో రోడ్డుపై కూర్చుని ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పీఏ చంద్రశేఖర్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణకుమార్ విచక్షణారహితంగా దాడిచేసి తల పగులగొట్టడం దారుణం.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికారపార్టీ తొత్తులుగా మారి చట్టవిరుద్ధంగా ఇలా దాడులకు పాల్పడితే ప్రజలకు దిక్కెవరు? తమకు అన్యాయం జరిగినపుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ పౌరులకు కల్పించారు. అరాచకశక్తుల మాయలోపడి చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రశేఖర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆయనకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది’’ అని నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-11-16T23:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising