KILARI ROSAIAH: రాబోయే ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీపై కిలారు రోశయ్య ఏమన్నారంటే...?
ABN, Publish Date - Dec 19 , 2023 | 05:28 PM
రాబోయే ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీపై ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య ( KILARI VENKATA ROSAIAH ) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కలిశారు.
అమరావతి: రాబోయే ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీపై ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య ( KILARI VENKATA ROSAIAH ) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘నేను వ్యక్తిగత పనుల మీదే సీఎంఓకు వచ్చాను. నన్ను ఎవ్వరూ టికెట్ విషయంలో పిలవలేదు. నాకు పొన్నూరు నుంచి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. పొన్నూరు నుంచే నేను పోటీ చేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ లేదనేది ప్రచారం మాత్రమే.మళ్లీ పొన్నూరు నుంచి పోటీ చేస్తాను’’ అని కిలారు రోశయ్య స్పష్టం చేశారు.
Updated Date - Dec 21 , 2023 | 06:58 AM