Chandrababu: 2024లో శిశుపాలుడిని సాగనంపుదాం
ABN, Publish Date - Dec 31 , 2023 | 07:41 PM
తెలుగు ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం’’ అని చంద్రబాబు తెలిపారు.
అమరావతి: తెలుగు ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలి అంటూ ఆకాంక్షించారు. శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపుదాం. కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం ఆనవాయతీ. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మరచిపోవాలని, అలాంటి రోజులు మళ్లీ వెంటాడకుండా జాగ్రత్త పడాలని, మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని నూతన సంవత్సర ఆరంభంలో సంకల్పిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.
Updated Date - Dec 31 , 2023 | 10:39 PM