ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: చండీయాగం, సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు

ABN, Publish Date - Dec 22 , 2023 | 10:30 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు.

ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు - భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు యాగం నిర్వహించారు. రేపు, ఎల్లుండి కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 10:30 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising