ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో ప్రత్యేక జీవోలతో సాయం చేశాం

ABN, First Publish Date - 2023-12-05T16:10:54+05:30

హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో ప్రత్యేక జీవోలతో ప్రజలకు సాయం చేశామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ( Nara Chandrababu Naidu ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో తుఫాన్‌పై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధిత గ్రామాల ప్రజలతో చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

అమరావతి: హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో ప్రత్యేక జీవోలతో ప్రజలకు సాయం చేశామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ( Nara Chandrababu Naidu ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో తుఫాన్‌పై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధిత గ్రామాల ప్రజలతో చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఆకలితో ఉన్న తుఫాను బాధితులకు భోజనం పెట్టడంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. తుఫాన్‌‌ను ఎదుర్కొంనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, తుఫాన్‌తో నష్టపోయిన బాధితులకు సాయం కూడా చేయడం లేదన్నారు. పెరిగిన సాగు ఖర్చులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేడు పరిహారం పెంచి ఇవ్వాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ప్రజలను అలర్టు చేయడంతో జగన్ ప్రభుత్వం విఫలం

‘‘తమకు కనీసం భోజనం కూడా పెట్టడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా, పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. వెంటనే భోజనం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు చంద్రబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని మండిపడ్డారు. విపత్తని ముందే తెలిసినా...ప్రజలను అలర్ట్ చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని చెప్పారు. వ్యవస్థల నిర్వీర్యం వల్లనే నేడు ఈ దుస్థితి దాపురించిదన్నారు. హుద్ హుద్ సమయంలో జీవో నెంబర్ 9 ద్వారా, తిత్లీ తుఫాన్ సమయంలో జీవో నెంబర్ 14 ద్వారా నష్ట పరిహారం పెంచి రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదని హితవు పలికారు. నాటితో పోల్చుకుంటే నేడు సాగు ఖర్చులు పెరిగాయని ప్రభుత్వం పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రజలకు మెరుగైన పరిహారం, సాయం అందేలా టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు సూచించారు.

Updated Date - 2023-12-05T17:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising