Lakshmana Reddy: పాలన అంటే ప్రత్యర్థులను దెబ్బకొట్టడమేనా జగన్‌రెడ్డి..?
ABN, First Publish Date - 2023-12-10T19:06:17+05:30
పాలన అంటే ప్రత్యర్థులను దెబ్బకొట్టడమేనా జగన్‌రెడ్డి ( JAGAN REDDY ) అని జన చైతన్య వేదిక నేత లక్ష్మణరెడ్డి ( Lakshmana Reddy ) అన్నారు. ఆదివారం నాడు సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం సదస్సు నిర్వహించారు.
తిరుపతి: పాలన అంటే ప్రత్యర్థులను దెబ్బకొట్టడమేనా జగన్‌రెడ్డి ( JAGAN REDDY ) అని జన చైతన్య వేదిక నేత లక్ష్మణరెడ్డి ( Lakshmana Reddy ) అన్నారు. ఆదివారం నాడు సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికే జగన్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా ఉంది. నెలలో రెండు, మూడు రోజులు మాత్రమే పని ఉండే వలంటీర్లకు ఒక్కో గ్రామంలో లక్ష రూపాయలు, సచివాలయ వ్యవస్థకు 3.5 లక్షలు మొత్తం 4.5 లక్షలు, ఏడాదికి 50 లక్షలు ఒక్కో గ్రామంలో ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఏడాదిలో 50 లక్షల రూపాయల అభివృద్ధి గ్రామంలో జరగడం లేదన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రజాధనం, అధికారం దుర్వినియోగం జరుగుతోందని చెప్పారు. ప్రత్యర్థులను దెబ్బకొట్టే విధంగా నిరంతరం జగన్‌రెడ్డి పాలన చేస్తున్నారని లక్ష్మణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-12-10T23:38:22+05:30 IST