ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి సంబంధం చెడిపోవడమే మేలనుకున్న యువతి.. వంట మనిషి ఇచ్చిన ఓదార్పుతో.. ఓ రోజు భయంభయంగానే..

ABN, First Publish Date - 2022-11-06T19:01:18+05:30

ప్రేమకు అందం, ఆస్తి, కులం, మతం ఇలాంటి ఏ పట్టింపులూ ఉండవనేది అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత హైటెక్ యుగంలోనూ ఇంకా ప్రేమికులకు ఈ విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రేమ వివాహ ఘటనల్లో కొన్నిసార్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమకు అందం, ఆస్తి, కులం, మతం ఇలాంటి ఏ పట్టింపులూ ఉండవనేది అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత హైటెక్ యుగంలోనూ ఇంకా ప్రేమికులకు ఈ విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రేమ వివాహ ఘటనల్లో కొన్నిసార్లు పరువు హత్యలు జరిగిన సందర్భాలను కూడా చాలా చూశాం. అయితే కొందరు తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల మనసును అర్థం చేసుకుని, వారి ఇష్టాయిష్టాలను గౌరవిస్తుంటారు. పిల్లల ప్రేమను అర్థం చేసుకుని దగ్గరుండి మరీ ఘనంగా వివాహం చేస్తుంటారు. ఇలాంటి అరుదైన ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనే పాకిస్థాన్‌లో జరిగింది. పెళ్లి సంబంధం చెడిపోవడమే మేలనుకున్న యువతి.. చివరకు వంట మనిషి ఇచ్చిన ఓదార్పుతో ప్రేమ పెంచుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

150 అడుగుల ఎత్తులో తలకిందులుగా వేలాడుతున్న 85ఏళ్ల వృద్ధుడు.. తీరా కింద పడిపోయే క్రమంలో..

పాకిస్థాన్‌లో (Pakistan) క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన ఓ ప్రేమ జంటకు సంబంధించిన వార్త (love stories).. సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇషాయ అనే యువకుడు స్థానిక డిఫెన్స్ హౌసింగ్ అథారిటీలో ఉంటున్న ఓ ఇంట్లో వంట మనిషిగా పని చేస్తుంటాడు. అతడి ప్రవర్తన నచ్చడంతో అతడి యజమాని కుటుంబ సభ్యులు కూడా.. ఇషాయను అభిమానంగా చూసుకునేవారు. ఈ క్రమంలో ఇంటి యజమాని కూతురు మిస్ట్రెస్ అన్నీ అనే యువతి కూడా ఇషాయతో స్నేహంగా ఉండేది. ప్రతి ఆదివారం ఆ యువతి వంట పనిలో ఇషాయకు సాయం కూడా చేస్తుండేది.

ప్రియురాలి ఇంటికి కొడుకును తీసుకెళ్లిన తండ్రి.. ఆ విషయం మర్చిపోమన్న తల్లి.. చివరకు..

ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే ఇటీవల మిస్ట్రెస్ అన్నీకి.. తల్లిదండ్రులు పెళ్లి సంబంధం (matrimonial matches) చూశారు. అయితే కాబోయే భర్త.. మిస్ట్రెస్ అన్నీ ఆస్తిపై కన్నేశాడు. ఈ విషయం తెలియడంతో యువతి.. తనకు అలాంటి భర్త వద్దంటూ తెగేసి చెప్పింది. అతడి కంటే ఇంట్లో వంట మనిషిగా ఉన్న ఇషాయ మనసు ఎంతో గొప్పదని భావించింది. ఓ రోజు అతడి వద్దకు వెళ్లి.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’.. అని అడిగింది. దీంతో ఇషాయ.. ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. రెండు రోజులు సమయం ఇస్తే.. ఆలోచించుకుని చెబుతా అని బదులిచ్చాడు.

పర్సు లాక్కెళ్లారని ఫిర్యాదు చేసిన మహిళ.. అసలు విషయం తెలుసుకుని వణికిపోయిన పోలీసులు..

ఎట్టకేలకు ఇషాయ పెళ్లికి అంగీకరించడంతో యువతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఎలాగైనా ఒప్పించాలని నిర్ణయించుకుంది. ఓ రోజు భయంభయంగా తండ్రి వద్దకు వెళ్లి.. తన ప్రేమ విషయాన్ని చెప్పింది. చివరకు తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం.. ఇషాయ, మిస్ట్రెస్ అన్నీ వివాహం ఘనంగా జరిగింది. వీరిని ఇటీవల ఓ య్యూటూబర్ ఇంటర్వ్యూ (YouTube interviews) చేయడంతో.. సోషల్ మీడియాలో వీరి ప్రేమ కథ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

ఓ వైపు కూతురు ట్యూషన్ చెబుతుంటే.. మరోవైపు తండ్రి చేసిన నిర్వాకం.. రోజూ చాక్లెట్లు ఇస్తూ.

Updated Date - 2022-11-06T19:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising