పర్సు లాక్కెళ్లారని ఫిర్యాదు చేసిన మహిళ.. అసలు విషయం తెలుసుకుని వణికిపోయిన పోలీసులు..

ABN , First Publish Date - 2022-11-05T18:17:34+05:30 IST

ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితుల పట్ల కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. సమస్య పరిష్కారించాల్సింది పోయి.. చివరికి వారికే చుక్కలు చూపిస్తుంటారు. మరికొందరైతే.. మామూళ్లు ఇచ్చిన వారికి మాత్రమే న్యాయం చేస్తుంటారు. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఇలాంటి ఉదంతాలు..

పర్సు లాక్కెళ్లారని ఫిర్యాదు చేసిన మహిళ.. అసలు విషయం తెలుసుకుని వణికిపోయిన పోలీసులు..

ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితుల పట్ల కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. సమస్య పరిష్కారించాల్సింది పోయి.. చివరికి వారికే చుక్కలు చూపిస్తుంటారు. మరికొందరైతే.. మామూళ్లు ఇచ్చిన వారికి మాత్రమే న్యాయం చేస్తుంటారు. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఇలాంటి ఉదంతాలు కోకొళ్లలుగా బయటపడుతుంటాయి. అదేవిధంగా నిజాయితీ, నిబబ్ధతతో పని చేసే పోలీసులు.. ఇలాంటి సమయాల్లో పైఅధికారుల ప్రశంసలు అందుకుంటుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పర్సు ఎత్తుకెళ్లారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు అసలు విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు సింగపూర్‌లో ప్రొఫెషనల్ చెఫ్.. ఇప్పుడు స్వదేశ వీధుల్లో చిన్న ఫుడ్ స్టాల్ ఓనర్.. అయితేనేం..

ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి చారూ నిగమ్‌కు (Senior IPS officer Charu Nigam) సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Viral videos) వైరల్ అవుతోంది. పోలీసుల పనితీరును పరీక్షించాలనే ఉద్దేశంతో ఆమె ఓ కట్టుకథ అల్లింది. ఔరయ్య జిల్లా ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌కు (Emergency Helpline Number) ఫోన్ చేసి, తన పర్సు ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. తర్వాత మొఖానికి మాస్కు, కళ్లద్దాలు పెట్టుకుని.. సివిల్ డ్రెస్‌లో రోడ్డు పైకి వెళ్లారు. ఫోన్ చేసిన కాసేపటికి కొందరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఆ పని చేసిందని ఆరోపిస్తూ.. యువతిని రోడ్డు పైకి ఈడ్చుకొచ్చిన యువకులు.. అంతా చూస్తుండగా..

తర్వాత ఆమె ఫిర్యాదును పోలీసులు చాలా ఓర్పుతో వినడంతో పాటూ కేసును పరిష్కరించేందుకు చొరవచూపారు. చివరకు అసలు విషయం తెలుసుకుని.. అంతా షాక్ అయ్యారు. పోలీసుల పనితీరుపై చారూ నిగమ్.. సంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ చేసిన వెంటనే స్పందించడంపై అందరినీ అభినందించారు. ఈ వీడియోను ఔరయ్య జిల్లా పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. చారూ నిగమ్‌తో పాటూ స్థానిక పోలీసులను అభినందిస్తున్నారు. ఇలాంటి అధికారులు ఉంటే కింది స్థాయి సిబ్బంది సక్రమంగా పని చేస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు.

బూట్లు వేసుకున్న బాలుడికి ఏడుసార్లు గుండెపోటు.. తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పుతో చివరకు..

Updated Date - 2022-11-05T18:18:43+05:30 IST