ఒకప్పుడు సింగపూర్‌లో ప్రొఫెషనల్ చెఫ్.. ఇప్పుడు స్వదేశ వీధుల్లో చిన్న ఫుడ్ స్టాల్ ఓనర్.. అయితేనేం..

ABN , First Publish Date - 2022-11-05T16:48:45+05:30 IST

లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలను.. ఉన్నపలంగా వదిలేసేందుకు చాలా మంది ధైర్యం చేయరు. కానీ కొందరు మాత్రం తాము అనుకున్నది సాధించే క్రమంలో..

ఒకప్పుడు సింగపూర్‌లో ప్రొఫెషనల్ చెఫ్.. ఇప్పుడు స్వదేశ వీధుల్లో చిన్న ఫుడ్ స్టాల్ ఓనర్.. అయితేనేం..

లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలను.. ఉన్నపలంగా వదిలేసేందుకు చాలా మంది ధైర్యం చేయరు. కానీ కొందరు మాత్రం తాము అనుకున్నది సాధించే క్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇంకొందరు విదేశాల్లో మంచి ఉద్యోగాలను వదిలిపెట్టి.. సొంతూరుకు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో మొదట్లో వారిని అంతా అవహేళన చేసినా.. చివరికి మాత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి.. అలాంటి కోవకే చెందుతుంది. సింగపూర్‌లో ప్రొఫెషనల్ చెఫ్ ఉద్యోగాన్ని వదిలేసి స్వదేశానికి వచ్చింది. ప్రస్తుతం చిన్న ఫుడ్ స్టాల్ నడుపుకొంటూ.. అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఆ పని చేసిందని ఆరోపిస్తూ.. యువతిని రోడ్డు పైకి ఈడ్చుకొచ్చిన యువకులు.. అంతా చూస్తుండగా..

పంజాబ్‌లోని (Punjab) మొహాలి సెక్టార్ 91లో ఓ యువతికి (young woman) చెందిన ఫుడ్ స్టాల్ (Food stall) .. ప్రస్తుతం భోజనప్రియులను తెగ ఆకర్షిస్తోంది. అమన్ అనే యువతి ఫ్యాషన్ టెక్నాలజీకి (Fashion technology) సంబంధించిన చదువు పూర్తి చేసిన అనంతరం.. హోటల్ మేనేజ్‌మెంట్ (Hotel Management) చదివేందుకు సింగపూర్ వెళ్లింది. అక్కడి యూనివర్శిటీలో టాపర్‪‌గా నిలిచింది. అయితే ఆమెకు సొంతంగా వ్యాపారం చేయాలని ఎప్పటినుంచో ఆలోచన ఉండేది. కానీ అప్పట్లో అవకాశం లేకపోవడంతో తర్వాత వివిధ హోటళ్లలో ప్రొఫెషనల్ చెఫ్‌గా (Professional chef) పని చేసింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు.

young-women-food.jpg

దోశలు వేస్తూ ఏడాదికి రూ.50 లక్షల సంపాదన.. బీకామ్‌కు మధ్యలోనే గుడ్ బై చెప్పి మరీ..!

చివరకు ఆరు నెలల క్రితం మొహాలిలోని సెక్టార్ 91లో ఎన్పీ టవర్ ఎదురుగా చిన్న ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసింది. రోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 3వరకూ స్టాల్ నిర్వహిస్తుంటుంది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా రోజూ ఒక మెనూ మారుస్తూ రుచికరమైన వంటకాలను అంబాటులో ఉంచుతోంది. రాజ్మా చావల్, ఆలూ మత్తర్, వైట్ చోల్, బ్లాక్ చోల్ తదితర పంజాబీ వంటకాలు ఇక్కడ అభిస్తాయి. కేవలం రూ.80తో శాఖాహార థాలీని, రూ.150తో చికెన్ కాంబో థాలీకి స్థానికంగా మంచి డిమాండ్ ఉంది. అన్ని వంటకాలను రుచికరంగా అందిస్తుండడంతో భోజనప్రియులు ఇక్కడికి క్యూకడుతున్నారు. ఈమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు యువతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇంటి ముందు రెండు మూడు రోజులు వార్తా పత్రికలు వేసి.. నాలుగో రోజు వీళ్లు చేసే పని తెలిస్తే.. వామ్మో! అంటారు..

Updated Date - 2022-11-05T16:58:38+05:30 IST