దోశలేస్తూ ఏడాదికి రూ.50 లక్షలు... బీకామ్‌కు గుడ్ బై చెప్పి..!

ABN , First Publish Date - 2022-11-04T16:32:44+05:30 IST

కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనిలో ఆనందంతో పాటూ ఆదాయం కూడా ఉంటుందని నిరూపిస్తున్నాడు.. రాజస్థాన్‌కు చెందిన రాజేంద్ర అనే యువకుడు. B.Com చదువును మధ్యలోనే ఆపేశాడు. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో..

దోశలేస్తూ ఏడాదికి రూ.50 లక్షలు... బీకామ్‌కు గుడ్ బై చెప్పి..!

కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనిలో ఆనందంతో పాటూ ఆదాయం కూడా ఉంటుందని నిరూపిస్తున్నాడు.. రాజస్థాన్‌కు చెందిన రాజేంద్ర అనే యువకుడు. ఇంటర్ తర్వాత అతడికి చదువుపై ఆసక్తి తగ్గింది. దీంతో B.Com లో అడ్మిషన్ తీసుకుని, చదువును మధ్యలోనే ఆపేశాడు. సొంతంగా వ్యాపారం చేయాలనే అతడి ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఇందుకోసం బెంగళూరు (Bangalore) వెళ్లి క్యాంటరింగ్‌లో పని చేశాడు. చివరకు దోశలను సరికొత్తగా అందించాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం దోశలు వేస్తూ (Dosa business) ఏడాదికి రూ.50 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇతడి సక్సెస్ స్టోరీకి (Success stories) సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral Video: మనుషులు మెసేజ్ చేయడం మామూలే.. కానీ చిలుక చాటింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా..

రాజస్థాన్ (Rajasthan) జోధ్‌పూర్ జిల్లాకు చెందిన రాజేంద్ర.. 2020లో బీకామ్‌ను మధ్యలోనే ఆపేశాడు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిత్యం ఆలోచించేవాడు. చివరకు కొందరు మిత్రుల సలహా మేరకు బెంగళూరులోని లింగరాజపురం వెళ్లాడు. అక్కడి సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్‌లో రెండేళ్ల పాటు క్యాటరింగ్‌లో పని చేశాడు. అప్పుడే దోశల్లో వివిధ రకాల గురించి తెలుసుకున్నాడు. అదే వ్యాపారాన్ని సొంతంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వచ్చి 2022 నుంచి తోపుడు బండిపై వివిధ రకాల దోశెలను వేయడం ప్రారంభించాడు. ఖవాన్‌ఖండ్ నగరంలోని సర్దార్‌పురా చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలో రోజూ సాయంత్రం దోశల స్టాల్‌ను ఏర్పాటు చేయడం మొదలెట్టాడు.

student-new.jpg

Viral Video: సినిమా స్టైల్లో డ్యాన్స్ వేయాలని భార్యను ఎత్తుకున్న భర్త.. చివరకు అందరి ముందూ..

సాయంత్రం అయ్యిందంటే చాలు.. రాజేంద్ర దోశల కోసం భోజన ప్రియులు క్యూకడుతుంటారు. దోశలు వేయడంలో రాజేంద్ర.. కొత్త పద్ధతిని అవలంభించాడు. సౌత్ ఇండియన్ డిష్‌కి వెస్ట్రన్‌ని మిక్స్ చేసి కొత్త రకం దొశను రూపొందించడం ఇతడి ప్రత్యేకత. అలాగే దోశల తయారీలో సౌత్ ఇండియన్‌తో పాటూ స్థానికంగా లభించే మసాలాలను వినియోగిస్తుంటారు. ఇక్కడ పిజ్జా దోశ, జెనీ దోశ, పావ్‌బాజీ కాంబినేషన్ దోశ, మైసూర్ దోశ వంటి సుమారు 99రకాలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఒక్క పిజ్జా దోశకే రోజూ వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తుంటాయని రాజేంద్ర చెబుతున్నాడు. గ్యాస్ స్టౌవ్‌పై వండిన దోశ తింటే వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అందుకే తాను గుండ్రటి ఇనుప పొయ్యిపై బొగ్గులపై దోశ వేయడం ప్రారంభించానని తెలిపాడు. ఇలా చేయడం వల్ల ఆసిడిటీ వంటి సమస్యలు (Acidity problem) ఉండవని రాజేంద్ర చెబుతున్నాడు.

ఇంటి ముందు రెండు మూడు రోజులు వార్తా పత్రికలు వేసి.. నాలుగో రోజు వీళ్లు చేసే పని తెలిస్తే.. వామ్మో! అంటారు..

పెళ్లిళ్ల సీజన్‌లో (Wedding season) రాజేంద్రకు విపరీతమైన ఆర్డర్లు వస్తుంటాయి. 2022 నుంచి రాజేంద్ర తోపుడు బండిపై దోశలను వేయడం ప్రారంభించాడు. ప్రత్యేకమైన దోశలను వేసేందుకు కర్నాటక నుంచి మాస్టర్లను పిలిపించినట్లు రాజేంద్ర తెలిపాడు. బొగ్గులపై దోశలను వేయడంతో పాటూ రుచి కూడా అద్భుతంగా ఉండడంతో.. భోజన ప్రియులు గుంపులు గుంపులుగా వస్తుంటారు. పనీర్ కాంబినేషన్, స్పినాచ్, మొక్కజొన్న దోశ మష్రూమ్, స్ప్రింగ్ దోశ, షెజ్వాన్ మసాలా దోశ, పనీర్ స్వీట్ కార్న్ తదితర రకాల దోశలను రూ.70 నుంచి రూ.150వరకు అందిస్తుంటాడు. రోజూ సుమారు 400 మేర ఆర్డర్లు వస్తుంటాయని రాజేంద్ర చెబుతున్నాడు. పనిలో తన అన్నయ్య మోహిత్ చౌదరి కూడా సాయం చేస్తుంటాడని చెప్పాడు. ప్రస్తుతం రాజేంద్ర.. ఏడాదికి రూ.45 నుంచి రూ.50 లక్షల మేర ఆర్జిస్తున్నాడు. ఇష్టంతో చేసే ఏ పని అయినా చివరకు విజయవంతం అవుతుందని నిరూపించిన రాజేంద్రను.. స్థానిక యువత ఆదర్శంగా తీసుకుంటున్నారు.

40కోళ్లతో మొదలైన ప్రస్థానం.. పాకెట్ మనీ కోసం ఇంట్లోని గుడ్లు అమ్మిన 9ఏళ్ల బుడ్డోడు.. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాడంటే..

Updated Date - 2022-11-04T17:24:49+05:30 IST