ఆ పని చేసిందని ఆరోపిస్తూ.. యువతిని రోడ్డు పైకి ఈడ్చుకొచ్చిన యువకులు.. అంతా చూస్తుండగా..

ABN , First Publish Date - 2022-11-05T15:39:37+05:30 IST

కొన్నిసార్లు కళ్లతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు. కానీ తాము నమ్మిందే నిజమని భావించే క్రమంలో.. కొందరు దారుణానికి పాల్పడడమో, లేక దారుణంగా మోసపోవడమో జరుగుతుంటుంది. తప్పు జరిగిందని తెలిసేలోపు.. జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. బీహార్‌లో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది...

ఆ పని చేసిందని ఆరోపిస్తూ.. యువతిని రోడ్డు పైకి ఈడ్చుకొచ్చిన యువకులు.. అంతా చూస్తుండగా..

కొన్నిసార్లు కళ్లతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు. కానీ తాము నమ్మిందే నిజమని భావించే క్రమంలో.. కొందరు దారుణానికి పాల్పడడమో, లేక దారుణంగా మోసపోవడమో జరుగుతుంటుంది. తప్పు జరిగిందని తెలిసేలోపు.. జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. బీహార్‌లో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నేరం చేసిందని భావించి.. ఓ యువతిని రోడ్డు పైకి ఈడ్చుకొచ్చారు. అంతా చూస్తుండగా.. నడిరోడ్డుపై దారుణానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

బూట్లు వేసుకున్న బాలుడికి ఏడుసార్లు గుండెపోటు.. తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పుతో చివరకు..

బీహార్‌లోని (Bihar) హాజీపూర్ బీచ్ మార్కెట్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. హాజీపూర్‌లోని రహీమాపూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిపై బీచ్ మార్కెట్‌ వద్ద కొందరు దాడికి (Assault on young woman) పాల్పడ్డారు. యువతి తన పర్సు, మొబైల్ దొంగిలించిందని (theft) ఓ మహిళ ఆరోపించింది. దీనికి కొందరు మరి కొందరు అక్కడికి చేరుకుని.. పిల్లలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిందని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కొందరు ఆకతాయిలు ఆమెను పట్టుకుని రోడ్డుపైకి లాక్కొచ్చారు. నిజం చెప్పాలంటూ ఆమె జుట్టు పట్టుకుని దాడికి పాల్పడ్డారు. సాటి మహిళ అని కూడా చూడకుండా కొందరు మహిళలు కూడా ఆమెపై దాడికి దిగారు.

వాహనాల తనిఖీలో పట్టుబడ్డ ప్రేమికులు.. విచారించగా బయటపడ్డ మహిళ వివాహేతర సంబంధం..

తాను ఎలాంటి దొంగతనం చేయలేదంటూ యువతి ఎంత బ్రతిమాలినా.. స్థానికులు మాత్రం వినిపించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను వారి నుంచి విడిపించారు. అనంతరం స్టేషన్‌కి తరలించి, విచారించారు. అయితే, యువతిపై చోరీ ఆరోపణలు చేసిన వారు.. శుక్రవారం రాత్రి వరకూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు. పూర్తి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఇదిలావుండగా, యువతిపై దాడి చేసే సమయంలో కొందరు ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: వీడు మనిషా.. కాదా..! కారు పక్కన నిలబడ్డ పాపానికి.. చిన్నారిని ఏకంగా..

Updated Date - 2022-11-05T15:52:14+05:30 IST