150 అడుగుల ఎత్తులో తలకిందులుగా వేలాడుతున్న 85ఏళ్ల వృద్ధుడు.. తీరా కింద పడిపోయే క్రమంలో..

ABN , First Publish Date - 2022-11-06T15:51:52+05:30 IST

ప్రాణాల మీద ఆశలు వదులుకున్న సందర్భాల్లో ఒక్కోసారి ఆశ్చర్యకర ఘటనలు జరుగుతుంటాయి. అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పింది.. అని ఇలాంటి సందర్భాల్లోనే అంటూ ఉంటాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, చైనాలో ఓ 85ఏళ్ల వృద్ధుడు..

150 అడుగుల ఎత్తులో తలకిందులుగా వేలాడుతున్న 85ఏళ్ల వృద్ధుడు.. తీరా కింద పడిపోయే క్రమంలో..

ప్రాణాల మీద ఆశలు వదులుకున్న సందర్భాల్లో ఒక్కోసారి ఆశ్చర్యకర ఘటనలు జరుగుతుంటాయి. అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పింది.. అని ఇలాంటి సందర్భాల్లోనే అంటూ ఉంటాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, చైనాలో ఓ 85ఏళ్ల వృద్ధుడు (old man) పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. 150 అడుగుల ఎత్తులో బిల్డింగ్ కిటికీ నుంచి ప్రమాదవశాత్తు కిందకు పడిపోబోయాడు. అయితే అదృష్టవశాత్తు కిటికీలో కాలు ఇరుక్కోవడంతో తలకిందులుగా వేలాడుతూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. (Viral photos and videos) నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Viral Video: రైలు బోగీ దగ్గర ఈ పోలీస్ తిప్పలు చూడండి.. పాపం అటూ ఇటూ తిరుగుతూ..

చైనాలోని (China) షావోగ్వాన్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని‌ ఓ ఫ్లాట్‌లో 85ఏళ్ల వృద్ధుడు తన కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. ఈయనకు ఇటీవల బ్రెయిన్ సర్జరీ (Brain surgery) జరిగింది. ఇటవల ఓ రోజు ప్రమాదవశాత్తు కిటికీ నుంచి జారి కింద పడిపోబోయాడు. అయితే అదృష్టవశాత్తు అతడి కాలు.. కిటికీకి, కుర్చీకి మధ్యలో ఇరుక్కుంది. దీంతో తలకిందులుగా వేలాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఓ యువతి షాపింగ్‌కు వెళ్తూ.. కిందకు వేలాడుతున్న వృద్ధుడిని చూసి షాక్ అయింది.

ప్రియురాలి ఇంటికి కొడుకును తీసుకెళ్లిన తండ్రి.. ఆ విషయం మర్చిపోమన్న తల్లి.. చివరకు..

వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Firefighters), స్థానిక మీడియాకు సమాచారం అందించింది. అనంతరం అక్కడే ఉన్న కొంతమంది యువకులకు ఈ విషయం తెలియజేసింది. అంతా కలిసి పరుగెత్తుకుంటూ వృద్ధుడి ఫ్లాట్‌కి వెళ్లిపోయారు. వృద్ధుడి కాలుకు ఓ షీట్ కట్టి కిందపడకుండా పట్టుకున్నారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వృద్ధుడిని రక్షించారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న వృద్ధుడి కుమార్తె.. తన తండ్రిని కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు సింగపూర్‌లో ప్రొఫెషనల్ చెఫ్.. ఇప్పుడు స్వదేశ వీధుల్లో చిన్న ఫుడ్ స్టాల్ ఓనర్.. అయితేనేం..

Updated Date - 2022-11-06T16:06:49+05:30 IST