జగన్ సాధించిన అతిపెద్ద ఘనత ఏంటంటే..
ABN, Publish Date - Jun 06 , 2025 | 06:56 AM
జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర విధ్వంసానికి గురైంది. కేంద్రం ఇచ్చే పథకాలను కూడా రాష్ట్రంలో అమలు చేయలేని దశకు చేరుకుని 93 పథకాల అమలు నిలిచిపోయింది.
అమరావతి: రాష్ట్రాన్ని అరాచకంలోకి నెట్టిన ఘనుడు వైఎస్ జగన్ (YS Jagan).. తిరోగమన పాలనకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అధినేత.. జగన్ ఐదేళ్ల పాలన ఒక పీడకల.. వ్యవస్థల విధ్వంసం జగన్ సాధించిన అతిపెద్ద ఘనత.. వైసీపీ పాలనలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కుంటుపడడం (Development Halted)తోపాటు రాష్ట్రం అర్ధికంగా దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. ఉద్యోగులకు జీతాలు (Salary delays)కూడా సకాలంలో ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిని రాష్ట్రం ఎదుర్కొంది.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక వారి ఉద్యోగ విరమణ వయసు పెంచి చేతులు దులుపుకుంది. ఇంతకంటే దుస్థితి మరొకటి ఉంటుందా.. జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర విధ్వంసానికి గురైంది. కేంద్రం ఇచ్చే పథకాలను కూడా రాష్ట్రంలో అమలు చేయలేని దశకు చేరుకుని 93 పథకాల అమలు నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 06 , 2025 | 06:56 AM