కవితకు షోకాజ్ నోటీసులు..!
ABN, Publish Date - May 30 , 2025 | 09:18 AM
BRS vs Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశముందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.అలాగే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఒక వర్గం అంటుండగా.. కేసీఆర్ అంతటి కఠిన నిర్ణయం ఇప్పటికప్పుడు తీసుకోరని మరో వర్గం అంటున్నారు.
Hyderabad: బీఆర్ఎస్ (BRS)లో ఏం జరగబోతోంది.. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విషయంలో పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారు.. ఈ సంక్షోభం నుంచి పార్టీని కేసీఆర్ (KCR) ఎలా గట్టెక్కిస్తారని బీఆర్ఎస్ నేతలంతా (BRS leaers) ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే ఒకటి, రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసి వారం రోజులు గడుస్తున్నా.. కేసీఆర్ ఇంతవరకు ఆమెతో మాట్లాడ లేదు. కేవలం తనవైపు నుంచి ఇద్దరు దూతలను మాత్రమే పంపించారు. అయితే ఆ ఇద్దరు దూతలు కూడా ఎవరి మనుషులో అందరికీ తెలుసునంటూ కవిత వ్యాఖ్యనించారు.
Also Read: పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు
మరోవైపు కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశముందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అలాగే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఒక వర్గం అంటుండగా.. కేసీఆర్ అంతటి కఠిన నిర్ణయం ఇప్పటికప్పుడు తీసుకోరని మరో వర్గం వారు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఐఐ వార్షిక సదస్సుకు సీఎం చంద్రబాబు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక నిర్ణయం
For More AP News and Telugu News
Updated Date - May 30 , 2025 | 09:18 AM