ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యాంకర్ విష్ణు ప్రియ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు..

ABN, Publish Date - Mar 20 , 2025 | 01:23 PM

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు దూకుడు పెంచారు. వరసగా నోటీసులు ఇస్తూ కేసు నమోదైన 11 మంది నిందితులను విచారిస్తున్నారు.

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు దూకుడు పెంచారు. వరసగా నోటీసులు ఇస్తూ కేసు నమోదైన 11 మంది నిందితులను విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియను విచారించారు పంజాగుట్ట పోలీసులు. మూడు గంటలపాటు సుదీర్ఘంగా విచారణ చేసిన పోలీసులు.. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం విష్ణుప్రియ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని ఆదేశించారు. కాగా, కేసు నమోదైన 11 మందిలో పలువురు యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. అగ్ర హీరోలు, హీరోయిన్లతో కలిపి మెుత్తం 28 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 20 , 2025 | 02:08 PM