జనాభా లెక్కల సేకరణకు ముహూర్తం ఖారారు
ABN, Publish Date - Jun 05 , 2025 | 08:54 AM
India Census 2027: దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖారారు చేసింది. రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు వివరించింది.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల (Population Census) సేకరణకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ముహూర్తం ఖారారు చేసింది. మార్చి 1, 2027 (Begin March 1 2027) నుంచి దేశంలో 16వ జనగణను చేపట్టనున్నట్లు తెలిపింది. జనగణనతోపాటే కులగణన చేపడతామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది.
రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు వివరించింది. అయితే హిమపాతం ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖాండతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన లడ్డాఖ్‌లో 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభమవుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. మొత్తం మీద దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
For More AP News and Telugu News
Updated Date - Jun 05 , 2025 | 08:54 AM