ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బారికేడ్లు దూకిన అఖిలేష్ యాదవ్..

ABN, Publish Date - Aug 11 , 2025 | 01:46 PM

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎంపీలు నిరసన చేపట్టగా.. పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దూకేశారు.

ఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటింగ్ మోసం జరిగిందంటూ ఢిల్లీ (Delhi)లో ఇండియా కూటమి ఎంపీలు (ndia Alliance MPs) చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎంపీలు నిరసన చేపట్టగా.. పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దూకేశారు. అనంతరం మిగతా ఎంపీలు దూకే ప్రయత్నం చేశారు. ఈ మేరకు వారిని అడ్డుకున్న పోలీసులు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పలు వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లారు.

Updated Date - Aug 11 , 2025 | 01:51 PM