బాలయ్య ప్రేమకు తమన్ ఫిదా..
ABN, First Publish Date - 2025-02-15T20:50:02+05:30
అమరావతి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ మెుదలైంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో "యుఫోరియా మ్యూజికల్ నైట్" ఘనంగా ప్రారంభం అయ్యింది.
అమరావతి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ మెుదలైంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో "యుఫోరియా మ్యూజికల్ నైట్" ఘనంగా ప్రారంభం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. తలసేమియా వ్యాధి గురించి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మ్యూజిక్ నైట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఎమ్మెల్యే బాలకృష్ట సైతం తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించారు. అలాగే సంగీత దర్శకుడు తమన్‌పై తనకున్న అభిమానాన్ని బాలయ్య తెలియజేశారు.
Updated Date - 2025-02-15T20:50:03+05:30 IST