కోటిన్నర నోట్లతో అమ్మవారికి అలంకరణ..
ABN, Publish Date - Sep 26 , 2025 | 09:39 PM
కొల్లాపూర్ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని కోటిన్నర రూపాయలతో సుందరంగా అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కరెన్సీ నోట్లతో మాలలు చేసి అమ్మవారికి అలంకరణ చేశారు.
నాగర్ కర్నూల్: కొల్లాపూర్ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని కోటిన్నర రూపాయలతో సుందరంగా అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కరెన్సీ నోట్లతో మాలలు చేసి అమ్మవారికి అలంకరణ చేశారు. అయితే, కోటిన్నరతో అమ్మవారిని అలంకరించారని తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మవారిని చూసేందుకు పోటీ పడ్డారు. కాగా, దసరా మహోత్సవాల సందర్భంగా 9 రోజులపాటు అమ్మవారు పలు రూపాల్లో కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తూ తరిస్తున్నారు.
Updated Date - Sep 26 , 2025 | 09:39 PM