స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు..
ABN, Publish Date - Sep 24 , 2025 | 09:12 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ (బుధవారం) సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు కుటుంబం చేరుకుంది.
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ (బుధవారం) సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు కుటుంబం చేరుకుంది. అనంతరం సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. 22 సంవత్సరాల క్రితం తిరుమల వెంకన్నే తనకు ప్రాణభిక్ష పెట్టారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలో మంత్రి లోకేష్, బ్రహ్మణి దంపతులు సైతం పాల్గొన్నారు.
Updated Date - Sep 24 , 2025 | 09:14 PM