ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఐ శంకరయ్యపై టీడీపీ శ్రేణులు ఫైర్..

ABN, Publish Date - Sep 24 , 2025 | 07:25 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపిన సీఐ శంకరయ్యపై కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. ఈనెల 18న లీగల్ నోటీసులు పంపిన సీఐ.. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సీఎం చంద్రబాబుని డిమాండ్ చేయడంపై ఆగ్రహిస్తున్నారు.

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపిన సీఐ శంకరయ్యపై కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. ఈనెల 18న లీగల్ నోటీసులు పంపిన సీఐ.. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సీఎం చంద్రబాబుని డిమాండ్ చేయడంపై ఆగ్రహిస్తున్నారు. పైగా తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు రూ.1.45కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్న సీఐ శంకరయ్యపై ధ్వజమెత్తుతున్నారు. అయితే, శంకరయ్య తన నిజాయితీని నిరూపించుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని 2019లో సీఐ శంకరయ్యను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా హత్యపై కేసు నమోదు చేయెుద్దని, పోస్టుమార్టానికి పంపొద్దని.. అవినాశ్ రెడ్డి, దేవినేని శివశంకర్ రెడ్డి బెదిరించారని సీబీఐకి శంకరయ్య గతంలో వాగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వకుండా శంకరయ్య తప్పించుకున్నారు. అయితే వైసీపీ హయాంలో శంకరయ్యపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కాగా, ప్రస్తుతం కర్నూలు రేంజ్‌లో వీఆర్‌లో శంకరయ్య ఉన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 07:28 PM