గంజాయికి యువత దూరంగా ఉండాలి
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:17 PM
గంజాయి మత్తులో యువత చిత్తవుతుందని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం తాండూర్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ఆవరణలోని మైదానంలో తాండూర్ పోలీ సుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బెల్లంపల్లి డివిజన్ కబడ్డీ పోటీలను డీసీపీ ప్రారంభించి మాట్లాడారు.
-డీసీపీ భాస్కర్
-తాండూర్‌లో బెల్లంపల్లి డివిజన్ స్ధాయి కబడ్డీ పోటీలు
తాండూర్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : గంజాయి మత్తులో యువత చిత్తవుతుందని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం తాండూర్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ఆవరణలోని మైదానంలో తాండూర్ పోలీ సుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బెల్లంపల్లి డివిజన్ కబడ్డీ పోటీలను డీసీపీ ప్రారంభించి మాట్లాడారు. యువతలో మార్పు తీసుకురావడం కోసం పోలీసుల ఆధ్వర్యంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభి నందనీయమన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, క్రీడలపై మక్కువ పెంచుకుని రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. గంజాయి వదిలేద్దాం కబడ్డీ ఆడేద్దాం అనే నినా దంతో యువతలో మార్పు తీసుకురావడం కోసం పోటీలు నిర్వహించిన సీఐ కుమారస్వామిని, సిబ్బం దిని అభినందించారు. ఈ పోటీలు మంచిర్యాల కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రాంచందర్ పర్య వేక్షణ లో జరుగుతుండగా బెల్లంపల్లి డివిజన్ నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో తాండూర్ నివాసి అయిన ఎలుక రామ్‌చందర్ మొదటి బహుమతి రూ. 40 వేలు, ద్వితీయ బహుమతి సిరంగి శంకర్ రూ. 30 వేలు, మూడవ బహుమతి రూ. 20 వేలు, నాలుగో బహుమతి దుద్దిళ్ల వేణుగోపాల్ రామ్మో హన్‌ల జ్ఞాపకార్ధం తండ్రి దుద్దిళ్ల నారాయణరావు రూ. 10 వేలు ఇవ్వనున్నట్లు సీఐ తెలిపారు. పోటీల సందర్భంగా విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు అందర్ని అలరించాయి. అనంతరం డీసీపీ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్, తాండూర్ సీఐ కుమారస్వా మి, మందమర్రి సీఐ శశిదర్‌రెడ్డి, బెల్లంపల్లి రూరల్ సీఐ అప్జలుద్దీన్, బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ దేవయ్య, భీమిని, మాదారం ఎస్‌ఐలు విజయ్‌కుమార్, సౌజన్య, తాండూర్ రాజమౌళి పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 11:17 PM