ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ABN, Publish Date - Jul 18 , 2025 | 12:28 AM

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని మేటి చందాపురం ఇందుర్తి గ్రామంలో బుధవారం జరిగింది.

పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న సైదులు బంధువులు

మర్రిగూడ, జూలై 17(ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని మేటి చందాపురం ఇందుర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలంలోని దామర గ్రామానికి చెందిన బత్తుల చంద్రమ్మ, నరసయ్య దంపతుల పెద్ద కుమారుడు బత్తుల సైదులు(25) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. బుధవారం మర్రిగూడ మండలంలోని మేటి చందాపురం ఇందుర్తి గ్రామానికి ఓ పని విషయంలో వెళ్లాడు. ఆ గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో క్రిమిసంహారక మందు తాగి అనుమానాస్పదస్థితిలో పడి ఉన్నాడు. గ్రామస్థులు దగ్గరికి వెళ్లి చూసే సరికి సైదులు మృతిచెంది ఉన్నాడు. గ్రామస్థులు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి అతని కోసం ఆరా తీశారు. సైదులు నాంపల్లి మండలంలోని దామర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన సైదులు తల్లిదండ్రులు రాత్రి ఏడు గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన

తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ గురువారం సైదులు తల్లిదండ్రులు, బంధువులు, దామర గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. మృతికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. న్యాయం చేస్తామని పోలీ సులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - Jul 18 , 2025 | 12:28 AM