ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 15 రంగాలు.. ఏటా 30 వేల ఉద్యోగాలు

ABN, Publish Date - Feb 11 , 2025 | 04:39 AM

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోది. నిరుడు అక్టోబరులో నాలుగు విభాగాల్లో సర్టిఫికెట్‌ కోర్సులు ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం..

  • స్కిల్స్‌ యూనివర్సిటీ భారీ ప్రణాళిక

  • సింగపూర్‌ ఐటీఈ పాఠ్యాంశాలు

  • త్వరలో రాష్ట్రానికి సింగపూర్‌ బృందం

  • భాగస్వామ్యానికి పారిశ్రామికవేత్తల ఆసక్తి

  • చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగావకాశమన్న మంత్రి శ్రీధర్‌బాబు

  • స్కిల్స్‌ యూనివర్సిటీకి నిధులివ్వాలనే ప్రతిపాదనలేమీ లేవు: కేంద్రం

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోది. నిరుడు అక్టోబరులో నాలుగు విభాగాల్లో సర్టిఫికెట్‌ కోర్సులు ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం.. తాత్కాలిక క్యాంప్‌సలోనే మరిన్ని కొత్త కోర్సులు అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియాలో నాలుగు కోర్సుల్లో తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థుల నుంచి పెద్దఎత్తున డిమాండ్‌ రావడంతోపాటు విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం అయ్యేందుకు అనేక పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో త్వరలో హెచ్‌ఐసీసీలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లోని తాత్కాలిక క్యాంప్‌సలోనూ తరగతులు ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని, వర్సిటీకి ముచ్చర్లలో 150ఎకరాల్లో పూర్తిస్థాయి క్యాంపస్‌ అందుబాటులోకొస్తే ఏడాదికి 30వేల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


సింగపూర్‌ ఐటీఈ సహకారం

స్కిల్స్‌ యూనివర్సిటీతో పెద్తఎత్తున ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసింది. గత నెలలో సీఎం, రేవంత్‌, మంత్రి శ్రీదర్‌బాబు, ఉన్నతాధికారులతో కూడిన బృందం సింగపూర్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఐటీఈ)ను సందర్శించిన విషయం తెలిసిందే. స్కిల్స్‌ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తిపై అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సింగపూర్‌లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఈ పాఠ్యాంశాలు రూపొందించి నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా అక్కడ కోర్సు పూర్తవగానే అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇదే తరహా ప్రణాళికను స్కిల్స్‌ యూనివర్సిటీలో అమలు చేయనున్నారు. త్వరలో సింగపూర్‌ ఐటీఈ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి విశ్వావిద్యాలయం లో బోధన చేసేవారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం 3 నెలల సర్టిఫికేట్‌ కోర్సులతోపాటు రెండేళ్ల డిప్లొమా/డిగ్రీ కోర్సుల సిలబస్‌ రూపకల్పన జరుగుతోంది. ప్రస్తుతం స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌, స్కూల్‌ ఆఫ్‌ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌, ఈ-కామర్స్‌ విభాగాల్లో స్వల్పకాలిక కోర్సులు అందిస్తున్నారు. ఆస్పత్రుల రంగంలో అపోలో హాస్పిటల్స్‌, ఏఐజీ హాస్పిటల్స్‌, లైఫ్‌ సైన్సె్‌సలో డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, ఈ-కామర్స్‌లో నవత ట్రాన్స్‌పోర్ట్‌ లాంటి దిగ్గజ పారిశ్రామిక సం స్థలు ఇప్పటికే వర్సిటీతో భాగస్వామ్యమయ్యాయి. ఇదే తరహాలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న 15 రం గాలను ప్రభుత్వం గుర్తించింది. వీటికి సంబంధించిన పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతోంది. ప్రతి విభాగానికి డీన్‌తోపాటు భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్న పారిశ్రామికసంస్థల ప్రతినిధులు, ఆర్థిక సహకారం అందించే దాతలతో స్కూల్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.


ప్రతిపాదనలేమీ లేవు

తెలంగాణ స్కిల్స్‌ యూనివర్సిటీకి నిధులివ్వాలనే ప్రతిపాదనేమీ కేంద్రం వద్ద లేదని కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించి, ఉపాధి అవకాశాల కల్పించాలన్న లక్ష్యంతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వర్సిటీకి కేంద్రం నిధులు సమకూరుస్తుందా? దీనికి సంబంధించి కేంద్రం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా? అని చామల ప్రశ్నించగా.. తమ వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ప్రారంభమయ్యే విభాగాలు

  • యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ (ఏవీజీసీ)

  • అగ్రికల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌

  • టూరిజం, హాస్పిటాలిటీ

  • డిజిటల్‌ డిజైన్‌ ఫ రినివెబుల్‌ ఎనర్జీ

  • బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ (బీఎ్‌ఫఎ్‌సఐ)

  • బ్యూటీ, వెల్‌నెస్‌

  • ఆటోమోటివ్‌,ఎలక్ర్టిక్‌ వెహికిల్స్‌ (ఈవీ)

  • అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌

  • ఎలక్ర్టానిక్స్‌, సెమీ కండక్టర్స్‌

  • కన్‌స్ట్రక్షన్‌ ఫ రిటైల్‌

  • ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)

  • మీడియా, ఫిల్మ్‌

  • షిప్‌, ఏయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌


ఉద్యోగం వెతుక్కునే అవసరం లేకుండా..

సాంకేతిక, వృత్తివిద్య కోర్సులు పూర్తిచేసినవారికి ఎన్నోకొన్ని ఉద్యోగ అవకాశాలున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి సాధారణ డిగ్రీ కోర్సులు చేసిన విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎంతో శ్రమిస్తున్నారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంగా స్కిల్స్‌ యునివర్సిటీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. డిగ్రీ విద్యార్థులే కాదు పదోతరగతి, ఇంటర్‌ విద్యార్హతతో చదువు మానేసిన వారికీ నైపుణ్య శిక్షణ అందించి వారికి కూడా ఉద్యోగాలు కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారి ప్రారంభించిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యునివర్సిటీ దేశ విద్యా రంగంలోనే ఓ చరిత్రాత్మక నిర్ణయం. త్వరలో ఇతర రాష్ట్రాలూ తెలంగాణ బాటను అనుసరిస్తాయి.

- మంత్రి శ్రీధర్‌ బాబు


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

For Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 04:39 AM