ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: రేషన్‌కార్డు కోసం ఇప్పుడూ దరఖాస్తు చేసుకోవచ్చు..

ABN, Publish Date - Jan 21 , 2025 | 06:48 AM

నూతన రేషన్‌కార్డు కోసం, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ఇప్పుడు కూడా వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌(In-charge Minister Ponnam Prabhakar) సూచించారు.

- ఇంటి స్థలం ఉన్నా.. లేకున్నా ఇందిరమ్మ ఇళ్లు

- అర్హులందరికీ సంక్షేమ పథకాలు : మంత్రి పొన్నం

హైదరాబాద్: నూతన రేషన్‌కార్డు కోసం, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ఇప్పుడు కూడా వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌(In-charge Minister Ponnam Prabhakar) సూచించారు. గతంలో తీసుకున్న ప్రజాపాలన, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే పురోగతి, రేషన్‌కార్డుల జారీపై డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డితో కలిసి సోమవారం ఆయన జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Cold Wave: మళ్లీ చలి పంజా


ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఇంటి స్థలం ఉన్నా, లేకున్నా అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, చివరి లబ్ధిదారుడికి అందే వరకు కొనసాగిస్తామన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్‌కార్డు(Ration card) జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రేషన్‌కార్డుల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, ఈ విషయంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబరిది(GHMC Commissioner Ilambaridi), హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, అదనపు, జోనల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2025 | 06:48 AM