ఇక చకచకా..!
ABN, Publish Date - May 10 , 2025 | 11:26 PM
రిజిస్ట్రేషన్ ప్రక్రి య సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అవినీతికి ఆస్కారం లేకుండా త్వ రగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానా నికి శ్రీకారం చుట్టింది. ఈ నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 15 నిమిషాల్లోపే పూర్త య్యేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు లోకి తెచ్చింది.
-15 నిమిషాల్లోపే రిజిస్ట్రేషన్
-రేపటి నుంచి కొత్త విధానానికి శ్రీకారం
-ముందస్తు స్లాట్ బుకింగ్ తప్పనిసరి
-పని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు
-మంచిర్యాలలో ఇకమీదట ఇద్దరు సబ్ రిజిస్ట్రార్‌లు
మంచిర్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ ప్రక్రి య సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అవినీతికి ఆస్కారం లేకుండా త్వ రగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానా నికి శ్రీకారం చుట్టింది. ఈ నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 15 నిమిషాల్లోపే పూర్త య్యేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు లోకి తెచ్చింది. ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల ప్ర క్రియలో వేగం పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ఈ నెల 12 నుంచి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అమలు కానుంది.
స్లాట్ బుకింగ్ తప్పనిసరి...
కొత్త విధానంలో అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు ఇక మీ దట ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ ఇప్పటి వరకు సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మా ర్టిగేజ్ డీడ్లకు మాత్రమే ఉంది. ప్రస్తుతం వాటితో పా టు జీపీఏ, లీజు, వీలునామా ఇతర అన్ని రకాల రిజి స్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు. అంటే ఇక మీదట స్లాట్ బుకింగ్ లేకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్‌లు జరుగవు.‘‘ట్ఛజజీట్టట్చ్టజీౌుఽ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠ్టి.జీుఽ వెబ్ సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, స మయాన్ని ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకునే వె సులుబాటు ఉంది. తమకు కేటాయించిన సమయాని కి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని తక్కువ సమయం లోనే తిరిగి వెళ్లిపోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లోని సిటిజన్ లా గిన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ సమయంలో ఆస్తులు అమ్మేవారు, కొనేవారి వివరాలతో పాటు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. అలాగే సదరు ఆస్తులకు సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్ల సమాచారం అప్లోడ్ చేయాలి. ఇవన్నీ నమోదు చేశాక రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత చెల్లించాలి? అనేది వెబ్‌సైట్‌లో ఆటోమె టిగ్గా జనరేట్ అవుతుంది. వీటికి సంబంధించిన ఫీజు లు నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ పేమెంట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
వేగవంతంగా రిజిస్ట్రేషన్లు..
కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు సులభతరంగా, వేగ వంతంగా జరుగుతాయి. ఒక్కో డాక్యుమెంట్‌కు కేవలం 10 నుంచి 15 నిమిషాల సమయం మాత్రమే పడు తుంది. ఒక విధంగా చెప్పాలంటే వ్యవసాయ భూము లకు సంబంధించి ఇప్పుడు ఽభూ భారతి విధానంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాదిరిగానే స్లాట్ బుక్ చేసుకుని వేగవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మా ర్టిగేజ్ డీడ్, జీపీఏ, లీజు, వీలునామాతో పాటు అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లకు ముం దుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉం టుంది. ఒక రోజులో రెండు విడతలుగా స్లాట్‌లు బుక్ సుకునే అవకాశం ఉంది.
మంచిర్యాలకు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్‌లు....
మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అదనం గా మరో సబ్ రిజిస్ట్రార్‌ను నియమిస్తున్నందున ఎక్కు వ సంఖ్యలో స్లాట్లు అందుబాటులో ఉంచారు. కొత్త స బ్ రిజిస్ట్రార్ సోమవారం నుంచి విధుల్లో ఉండనున్నా రు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు కనీసం 96 రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉద యం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 48 స్లాట్లు, మధ్యాహ్నం రెండు నుంచి సాయం త్రం ఆరు గంటల వరకు 48 చొప్పున స్లాట్లు కేటా యించారు. అంటే ఒక్కో సబ్ రిజిస్ట్రారు గరిష్టంగా 48 స్లాట్లు వరకు రిజిస్ట్రేషన్ చేస్తారు. గతంలో రోజూ ఒ క్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 36 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉంచగా, నూతన విధానంలో వాటి సంఖ్యను 48కి పెంచారు. ఇదిలా ఉండగా, స్లాట్ బుక్ చేసుకోలేని వారి కోసం అత్యవసర రిజిస్ట్రేషన్లు చేసు కునే వెసులుబాటు కూడా ప్రభత్వం కల్పించింది. ఇలాంటి వారి కోసం రోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేకంగా వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లకు అ నుమతిస్తారు. వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లు రోజుకు కేవలం అయిదు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ఈ రిజిస్ట్రేషన్ చేస్తారు.
స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు...
ప్రియాంక, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్
ఇక మీదట స్లాట్ బుకింగ్ ద్వారా మాత్రమే రిజి స్ట్రేషన్లకు అనుమతి ఉంటుంది. అన్ని రకాల సేవలకు ఇదే పద్ధతి అనుసరించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి జి ల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే స్లాట్ బుకింగ్ వెసులుబాటు కల్పించారు. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు వెబ్ సైట్‌లో డాటా ఎంట్రీని జాగ్రత్త గా చేయాలి. స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ల ప్ర క్రియ త్వరగా పూర్తవుతుంది. ఎక్కువ సమయం కా ర్యాలయాల్లో వేచి చూడాల్సిన అవసరం ఉండదు. పూర్తి లింక్ డాక్యుమెంట్లతో నమోదు చేయాలి.
Updated Date - May 10 , 2025 | 11:26 PM