kumaram bheem asifabad- మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:18 PM
జిల్లాలో నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం సెర్ప్ ఏపీఎంలు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి హాజరయ్యారు.
ఆసిఫాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం సెర్ప్ ఏపీఎంలు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇస్తున్న ఉల్లాస్ కార్యకరమంలో భాగంగా ప్రతీ మహిళ అక్షరాస్యత కలిగి ఉండాలన్నారు. నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలో 22,494 మంది అక్షరాస్యత లేని మహిళలను గుర్తించామని చెప్పారు, వీరిని అక్షరాస్యులుగా మార్చడంలో సెర్ప్ సిబ్బంది, ఆపరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని తెలిపారు. ఇప్పటి వరకు 10,227 మంది అభ్యాసకులు, 1,067 మంది వలంటీర్లను ఎంపిక చేశామని తెలిపా రు. ఉల్లాస్ యాప్ ద్వారా వివరాలు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. అనం తనం నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటేషన్-2025 గోడ ప్రతులను ఆవిష్కరించారు.
ఫ రుణాల ప్రక్రియ పూర్తి చేయాలి
స్వయం సహాయక సంఘాల వారికి స్త్రీ నిధి రుణాలు, బ్యాంకు లింకేజీల ప్రక్రియ బ్యాంకర్ల సహకారంతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర వెంకటేష్ దోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలో సెర్ప్ ఏపీఎంలతో బుధవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల విద్యార్థులకు ఏక రూప దుస్తులు అందించే విధంగా ప్రధానోపాధ్యాయుల సంతకాలు తీసుకోవాలని, మహిళా సంఘాలు ఆర్థిక బలోపేతం కోసం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలలో పెట్రోల్‌బంకుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని తెలిపారు. గిరిజన మహిళ సంఘాల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ఉత్పాదకత కోసం నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష సమన్వయ కర్త మధుకర్, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి నాగరాజు, ఆర్పీలు మోహన్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 11:18 PM