మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలి
ABN, Publish Date - Jun 29 , 2025 | 11:26 PM
మహిళా సాధికారతే లక్ష్యంగా సంఘం ఆఫీస్ బేరర్లు పని చేయాలని ఏపీఎం విజయలక్ష్మి సూచిం చారు నూతనంగా ఎన్నికైన గ్రామ సంఘం-పదాధికారులకు నెన్నెలలో ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
నెన్నెల, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : మహిళా సాధికారతే లక్ష్యంగా సంఘం ఆఫీస్ బేరర్లు పని చేయాలని ఏపీఎం విజయలక్ష్మి సూచిం చారు నూతనంగా ఎన్నికైన గ్రామ సంఘం-పదాధికారులకు నెన్నెలలో ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సెర్ప్ రూపొందించిన నూతన చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండి కొత్త సారథులు బాధ్యతాయుతంగా పని చే యాలని సూచించారు. సమావేశాలు నిర్వహిస్తూ ఆర్థిక వనరులను స మర్థవంతంగా నిర్వహించడంతో పాటు నిఽధుల సేకరణ, ఖర్చులను ప ర్యవేక్షించాలని కోరారు. సంఘ సభ్యులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే లా చూసి, ప్రభుత్వ సంస్థల సమన్వయంతో పని చేయాలన్నారు. ప దాధికారుల విధులు, నూతన చట్టం, సభ్యుల సంక్షేమం, నిధుల నిర్వ హన తదితర అంశాలపై సీఆర్‌పీలు రజిత, రేణుకలు అవగాహన క ల్పించారు. ఈ కార్యక్రమంలో ఐబీసీసీ పంజాల ప్రకాష్‌గౌడ్, సీసీలు శ్రీనివాస్, గంగరాజు, శకుంతల, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 11:26 PM