ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళా సాధికారతే లక్ష్యం

ABN, Publish Date - Jul 13 , 2025 | 11:55 PM

రాష్ట్రంలో మ హిళా సాధికారతే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు వెలుతోందని డిప్యూటీ సీఎం మల్లుబట్టి వి క్రమార్క అన్నారు. మంచిర్యాల నియోజకర్గంలోని వివి ధ మండలాల్లో రూ.100కోట్ల పైచిలుకు అభివృద్ది పను లకు ఆదివారం ఉప ముఖ్యమంత్రి శంకుస్థాప నలు చేసారు.

నియోజకవర్గానిఇకి ఒక మైక్రో ఇండస్ర్టియల్‌ పార్కు ఏర్పాటు

ఉమడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

అర్హత గల ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క

మంచిర్యాల, జూలై 13 (ఆంద్రజ్యోతి): రాష్ట్రంలో మ హిళా సాధికారతే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు వెలుతోందని డిప్యూటీ సీఎం మల్లుబట్టి వి క్రమార్క అన్నారు. మంచిర్యాల నియోజకర్గంలోని వివి ధ మండలాల్లో రూ.100కోట్ల పైచిలుకు అభివృద్ది పను లకు ఆదివారం ఉప ముఖ్యమంత్రి శంకుస్థాప నలు చేసారు. ఈసందర్భంగా దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో రూ.3కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ నున్న ఇందిరా మహిళా శక్తి సోలార్‌ ప్లాంట్‌కు డిప్యూ టి సీఎం, రాష్ట్ర వివిధ శాఖల మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణా రా వుతో కలిసి శంకుస్థాపన చేసారు. ఈసందర్భంగా అ క్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బట్టి విక్రమా ర్క మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెం దేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా ప్రోత్స హిస్తోందన్నారు. వెల్గనూర్‌ జీపీ పరిధిలోని అందు గు లపేట శివారులో సుమారు 4ఎకారాల విస్థీర్ణంలో రూ.3కోట్ల అంచనా వ్యయంతో ఒక మెగావాట్‌ సామ ర్థ్యం గల సోలార్‌ విధ్యుత్‌ ప్లాంట్‌ను నెలకొల్పుతామ న్నారు. ప్లాంట్‌ ద్వారా ఐదు వందల నుంచి 5వేల వర కు విధ్యుత్‌ ఉత్పత్తి జరుగనుండగా రూ.51లక్షల రా బడి వస్తుందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు కోరిక మేరకు పవర్‌ప్లాంట్‌ను విస్తరించేందుకు కూడా ఆయన హామీ ఇచ్చారు. యంగ్‌ ఇండియా ఇం టిగ్రేటెడ్‌ సూల్స్‌ ద్వారా బడుగు బలహీన వర్గాల పిల్ల లకు కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తామ న్నారు. ప్రతీ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ర్టీయల్‌ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు ఉ పాధి అవకాశాలను మెరుగుపర్చనున్నట్లు తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం మహిళా శక్తి క్యాంటిన్లను, పెట్రోల్‌ పంపుల ఏర్పాటు, పెరటికోళ్ల పెంపకం, పాల డైరీ, మహిళ శక్తి భవనాలు ఏర్పాటుతో పాటు రద్దీ ఉ న్న ఖరీదైన ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు ఏ ర్పాటు చేసేందుకు స్థలాలు ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూ రు చేసి పేదల సొంతింటి కలను సహకారం చేస్తామ న్నారు. రైతుల సంక్షమంలో భాగంగా 70లక్షల రైతు కు టుంబాలకు రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు సాయం అందించామన్నారు. రూ.21వేల కోట్ల రుణమాఫీతో పాటు పంట నష్ట పరి హారం అందించామన్నారు. రాష్ట్రంలో 93లక్షల కుటుం బాలకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. ఉ మ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తమకు ప్రత్యేకమని, ప్రతి పక్షంలో ఉన్నపుడు రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు, తన పాదయాత్రకు బీజం పడింది ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే అని గుర్తు చేసారు. ఆకృతఙ్ఞతతో జిల్లాకు ప్రాణహిత -చేవేళ్ల ప్రాజెక్టును తిరిగి బహుమతిగా ఇస్తామన్నారు.

ఫఅదే విదంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలకు వ డ్డీ లేని రుణాలు మానివేసిందని, తమ ప్రభుత్వం మహిళలను అమితంగా ప్రోత్సహిస్తుందన్నారు. మం చిర్యాల కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లిలో రూ.30 కోట్లతో 210 ఎకరాల్లో ఐటీ పార్కు నిర్మించడం చాలా గొప్ప విషయం అన్నారు. తద్వారా ఈప్రాంత నిరు ద్యోగ యువత కు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభి స్తాయన్నారు. మంచిర్యాల నియోజకర్గంలో ప్రైవేట్‌ స్కూల్స్‌తో పోటీ పడే విధంగా అత్యాదునిక వసతుల తో ప్రభుత్వ పాఠ శాలలను నిర్మించడం ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుకే సా ధ్యపడిందని కొనియాడారు.

ఫరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ అసుపత్రి డిజైన్‌ రాష్ట్రం లోనే ఒక రోల్‌ మాడల్‌గా నిలువనుందన్నారు. ప్రభు త్వ సంక్షమాలను గుడ్డిగా అమలు చేస్తే ఏలాంటి ఫలి తం ఉండదని, ప్రజల అభివృద్ధే ధ్యేయంగా వర్గాల ప్రా తిపదికన సంక్షమ పథకాలు అందజేయాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. రాష్ట్రంలో బీసీ జనాభా 56శాతం ఉండగా 42శాతం రిజర్వేషన్‌ అమ లు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంద న్నారు. 35సంవత్సరాల బీసీల ఆకాంక్ష అయిన బీసీ కులగణణ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.

ఫజిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మా ట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో అస్తవ్యస్త పరి పాలన సాగిందని ఆరోపించారు. రాష్ర్టాన్ని అప్పుల కు ప్పగా మార్చారని ద్వజమెత్తారు. ప్రతీ నెల కేసీ ఆర్‌ చేసిన అప్పులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్డీలు చె ల్లించాల్సి వస్తోందన్నారు. గతంలో ఉన్న స్కీంలు ఎత్తివేయకుం డా అదనంగా కొత్త పథకాలకు చోటు కల్పిస్తున్నామని ఈ విషయం ప్రజలు గమనించాలని కోరారు.

ఫమంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ తన ప్రాణం పోయేదాకా ప్రజల సంక్ష మం కోసమే బతుకుతానని స్పష్టం చేసారు. 25ఏళ్ల త న రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూ సానని, చివరి నిమిషం వరకు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు గడ్డు రోజులు ఉన్న సమయంలో ఇంద్రవెల్లి సభను వి జయవంతం చేసి పార్టీకి పునర్జీవనం పోశానన్నారు. బట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రను కూ డా విజయవంతం చేసానన్నారు, 320బస్పులతో భార త్‌ జోడో యాత్రలో పాల్గొన్నానని తెలిపారు. దం డేప ల్లి మండలంలో రూ.80కోట్లతో నాలుగు లిఫ్టులు మం జూరు చేయాలని డిప్యూటి సీఎంను కోరగా ఆయ న సానుకూలంగా స్పందించారు. గూడెం ఆలయం వద్ద హరిత రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోర గా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అందుకు హామీ ఇచ్చారు. ఈసమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురే ఖ, కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆసీస్‌ సింగ్‌, జీసీసీ చైర్మన్‌ కోట్నాక తిరుపతి, మినిమమ్‌ వేజేస్‌ బోర్డు చై ర్మన్‌ జనక్‌ప్రసాద్‌, లక్షెట్టిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రేమ్‌ చంద్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కా ర్యకర్తలు పాల్గొన్నారు. బహిరంగ సభలో నియోజ కవర్గం నలు మూలల నుంచి దాదాపు లక్షకు పైగా మంది ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:55 PM