మహిళలు, విద్యార్థులు ధైర్యంగా ఉండాలి
ABN, Publish Date - Jul 24 , 2025 | 11:12 PM
మహిళలు, విద్యార్థులు ధైర్యంగా ఉండాలని అ డిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ అన్నారు.
- అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్
నాగర్‌కర్నూల్ క్రైం, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : మహిళలు, విద్యార్థులు ధైర్యంగా ఉండాలని అ డిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కా లేజీ బీఎస్సీ నర్సింగ్ విద్యా ర్థులకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విద్యార్థిను లు, మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ హెల్ప్‌లైన్ 100 డయల్ చేసే విధానం గురించి తెలియజేస్తూ మహిళలు విద్యార్థులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. మహిళలపై మా నసికంగా కానీ, శారీరకంగా కానీ దాడులకు పా ల్పడితే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ మధ్య సామాజిక మాధ్య మాల ద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ సమ యాన్ని వృథా చేసుకోవడమే కాకుండా అపరి చిత వ్యక్తుల ద్వారా మోసపోతున్నారన్నారు. బాధితులు 100 లేదా 8712657676 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని జిల్లా షీటీం ఇన్‌చార్జి విజయలక్ష్మి వివరించారు. షీటీం మెం బర్స్ వెంకటయ్య, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 11:12 PM