ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలు, విద్యార్థినులు ధైర్యంగా ఉండాలి

ABN, Publish Date - Jun 20 , 2025 | 11:08 PM

మహిళలు విద్యార్థినులు ధైర్యంగా ఉం డాలని షీటీం జిల్లా ఇన్‌చార్జి విజయలక్ష్మి పిలుపునిచ్చారు.

పెద్దకొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టం గురించి వివరిస్తున్న షీటీం ఇన్‌చార్జి విజయలక్ష్మి

- షీటీం జిల్లా ఇన్‌చార్జి విజయలక్ష్మి

పెద్దకొత్తపల్లి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : మహిళలు విద్యార్థినులు ధైర్యంగా ఉం డాలని షీటీం జిల్లా ఇన్‌చార్జి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీటీం ఆధ్వర్యం లో పోక్సో చట్టం గురించి జరి గిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళల గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలి గించే మాటలేవైనా లైంగిక వేధింపుల కిందకే వస్తాయని పని ప్రదేశాల్లో, బస్సులు, ఆటోల్లో ప్రయాణంలో ఉన్న మహిళలపై వేధిం పులు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. మ హిళలపై మానసకింగా, శారీరకంగా దాడుల కు పాల్పడితే ఽబాధితులు 100లేదా 8712657676 నెంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ మేరీ సునీల, షీటీం మెం బరు వెంకటయ్య, భరోసా లీగల్‌ సపోర్టు గాయ త్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

బల్మూరు : విద్యార్థులు పోలీసు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని స్థానిక ఎస్‌ఐ అం గోత్‌ రాజేందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ ఉన్నత పాఠశాల 8, 9వ తరగతి విద్యార్థులు పోలీస్‌ స్టేషన్‌ విజిట్‌ చేశారు. పోలీసులు ప్రజలకు ఏ విధంగా సహాయపడు తున్నారు, నేర విచారణలో పోలీసుల పాత్ర, ప్రజల నుంచి పిటిషన్‌ ఏ విధంగా తీసుకుంటు న్నారు, పోలీస్‌ స్టేషన్‌ రికార్డుల నిర్వహణ గురించి ఎస్‌ఐ వివరించారు. కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు నరేందర్‌ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:08 PM