ప్రజల ఆకాంక్షలు ఫలించేనా?
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:59 AM
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సీఎం అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. తుం గతుర్తి నియోజకవర్గం తిరుమలగిరికి గతంలో కేసీఆర్ మూడు సా ర్లు వచ్చినా ఒక సారి పార్టీ అధినేతగా, మిగతా రెండు సార్లు సీఎం గా వచ్చినా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికే వచ్చా రు.
ప్రజల ఆకాంక్షలు ఫలించేనా?
ఎమ్మెల్యే సామేలు ఏమేం అడుగుతారు
సీఎం ఎన్నింటికి హామీ ఇస్తారోనని ప్రజల ఎదురుచూపులు
తుంగతుర్తి నియోజకవర్గంలో సీఎం అధికారిక పర్యటన ఇదే తొలిసారి
ఉమ్మడి జిల్లాలో పెద్ద నియోజకవర్గం
అభివృద్ధిలో వెనుకబాటు
(ఆంధ్రజ్యోతి-మోత్కూరు):
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సీఎం అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. తుం గతుర్తి నియోజకవర్గం తిరుమలగిరికి గతంలో కేసీఆర్ మూడు సా ర్లు వచ్చినా ఒక సారి పార్టీ అధినేతగా, మిగతా రెండు సార్లు సీఎం గా వచ్చినా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికే వచ్చా రు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రభుత్వ అధికార పర్యటనలు కావు. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గానికి తొలిసారి అధికారికంగా వస్తున్న ముఖ్యమంత్రి రేవంతరెడ్డి తిరుమలగిరిలో ప్రభుత్వ పరంగా కొత్త రేషనకార్డులు పంపిణీ చేయనున్నా రు. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వస్తే ఏవో కొన్ని హామీలు నెరవేర్చి ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నది ఎమ్మెల్యేల, ప్రజల విశ్వా సం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంతరెడ్డితో కొన్ని హామీలు తీసుకోవాలన్న పట్టుదలతో నియోజకవర్గానికి రప్పిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం సూ ర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు విస్తరించి 9 మండలాలతో ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పెద్ద నియోజక వర్గంగా ఉంది. అభివృద్ధిలో మాత్రం అత్యంత వెనుకబడి ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత సీఎం కేసీఆర్ తుంగతుర్తిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, రుద్రమ్మ చెరువును రిజర్వాయ ర్ చేస్తామని, తిరుమలగిరి మండలానికి దేవాదుల నీరు అందిస్తామని, మోత్కూరులో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తిరుమలగిరి ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చారు. వాటిలో తుంగతుర్తిలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం హామీ మాత్రమే అమలు నో చుకుంది. మిగతా హామీలు అటకెక్కాయి. ఇప్పటికే రూ.1400 కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు చెబుతున్న ఎమ్మెల్యే సామేలు సీఎంరేవంతరెడ్డితో నియోజకవర్గ అభివృద్ధికి మరో రూ. వెయ్యికోట్ల నిధులు మంజూరు చేయించుకోవడానికి కృషి చేస్తున్న ట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సామేలు ఏఏ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తారు. సీఎం రేవంతరెడ్డి ఏ మేరకు హామీలు ఇస్తారోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
సమస్యలు ఇవి...
ఇప్పటికే నిధులు మంజూరైన మో త్కూరు, అడ్డగూడూరు మండలాల కు సాగునీరు అం దించే బునాదిగాని (ధర్మారం) కాల్వ నిర్మాణం పూర్తి చేసి, ఈ కాల్వను బస్వాపూర్ రిజర్వాయర్‌కు అనుసంధానం చేయడం.
తుంగతుర్తి మండలం రద్రమ్మ చెరువును రిజర్వాయర్ చేయడం.
కళాశాలలు అందుబాటులో లేక, ప్రైవేటు కళాశాలలకు వెళ్లలేక పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నందున మోత్కూరు, తుంగతుర్తి మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం. సాంకేతిక విద్యనందించడానికి నియోజకవర్గంలో కనీసం రెండు పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయడం.
మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల ప్రజలకు వైద్యం, పోస్టుమార్టం సౌకర్యం అందుబాటులో ఉండేలా మోత్కూరులో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడం.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే ఒక్క ఆర్టీసీ బస్సు డిపో ఉన్నందున జిల్లాలో రెండో ఆర్టీసీ బస్సుడిపో మోత్కూరులో ఏర్పాటు చేయడం.
తిరుమలగిరి మండలానికి చెన్నూరు రిజర్వాయర్ నుంచి దేవాదుల నీరు అందించడం.
యాదాద్రి జిల్లాలో మోత్కూరు, సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి మండలాలను రెవెన్యూ డివిజన్లు చేయడం.
నూతనకల్ మండలం మాచనపల్లి-ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం కాకరవాయి గ్రామాల మధ్య ఉన్న పాలేరు వాగుపై వంతెన నిర్మాణం. ఈ వంతెన నిర్మాణంతో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం చాలా మెరుగవుతుంది.
యువతకు ఉపాధి కల్పనకు అడ్డగూడూరు మండలం డి.రేపాక గ్రా మంలో ఉన్న 80ఎకరాల ప్రభుత్వ భూమిలో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయడం. తిరుమలగిరిలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం.
తుంగతుర్తిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం.
మోత్కూరులో కోర్టు, పోలీస్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయడం.
మోత్కూరు బిక్కేరు వాగుపై శిథిలమైన బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేయడం.
నాగారం మండలంలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం.
ఇట్లు
తుంగతుర్తి నియోజకవర్గం
Updated Date - Jul 14 , 2025 | 12:59 AM