హామీలు అమలు చేయమంటే అరెస్టులు చేస్తారా !
ABN, Publish Date - Mar 18 , 2025 | 11:13 PM
అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మం గళవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్
- కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్‌వాడీ ఉద్యోగులు
- సీఐటీయూ నాయకుల అరెస్ట్
నాగర్‌కర్నూల్ టౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మం గళవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చే యాలని 48గంటల సమ్మెలో భాగంగా రెండో రోజు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం క లెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఆంగన్‌వాడీ టీచర్లు, ఆయా లతో సీఐటీయూ నాయకులు కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి దాదా పు దాదాపు రెండు గం టల ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు అక్క డికి చేరుకుని సీఐటీ యూ నాయకులను బ లవంతంగా లాకెళ్లి వా హనంలో ఎక్కించారు. దీంతో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పో లీసుల వాహన్ని అడ్డు కుని ఆందోళన చేశారు. దీంతో సీఐటీయూ నాయకులతో పాటు అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చేసే అరెస్టులు చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం తక్షణ మే స్పందించి అంగన్‌వాడీ టీచర్ల కనీస వేతనం రూ.18 వేలకు పెంచడంతో పాటు వారి సమస్య లు పరిష్కరిం చాలని కోరారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వర్ధం పర్వతాలు, సహాయ కార్య దర్శి పొదిల రామయ్య, కోశాధికారి అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.గీత, డీవై ఎఫ్‌ఐ జిల్లా సహా య కార్యదర్శి నాగపూర్, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు చంద్రకళ, ప్రభావతి, రజియా, సుచిత్ర, జయమ్మ, అంజనమ్మ, రం జాన్‌బీ, సుగుణ, అలివేల, వెంకటమ్మ, భాగ్యమ్మ, విజయలక్ష్మి, యాదమ్మ, కృష్ణవేణి, అనిత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 18 , 2025 | 11:13 PM