ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏజెన్సీ భూముల స్వాధీనంలో జాప్యమేల...?

ABN, Publish Date - May 13 , 2025 | 11:23 PM

దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో గిరిజన (ఏజెన్సీ) భూములను కబ్జా చేయడమే గాకుండా, అందులో అక్రమంగా రైస్‌ మిల్లు ఏర్పాటు చేసిన ఘటనలో ఉ న్నతాధికారుల ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి.

-రెవెన్యూ, పోలీస్‌శాఖల దోబూచులాట

-కస్టడీకి తీసుకోవాలంటూ ఐటీడీఏ పీవో ఆదేశాలు

-ఆదేశాలను బుట్ట దాఖలు చేసిన అధికారులు

-మూడు నెలలైనా అడుగు ముందుకు పడని వైనం

మంచిర్యాల, మే 13 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో గిరిజన (ఏజెన్సీ) భూములను కబ్జా చేయడమే గాకుండా, అందులో అక్రమంగా రైస్‌ మిల్లు ఏర్పాటు చేసిన ఘటనలో ఉ న్నతాధికారుల ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. కబ్జాకు గురైంది ఏజెన్సీ భూమి కావడంతో తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఉట్నూరులోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా మూడు నెలల క్రితమే తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆ ప్రక్రియ ముందు కు సాగకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా భూముల స్వాధీనం సమయంలో శాం తి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో పో లీస్‌ బందోబస్తు కోరామని రెవెన్యూ, తాము సిద్దమే నంటూ పోలీస్‌శాఖలు ఒకదానిపై ఒకటి నెపం నెట్టు కుంటూ దోబూచులాడుతున్నాయి. ఇలా మూడు నెల లుగా కాలయాపన చేస్తున్నాయే తప్ప... ఆక్రమిత భూ ములను మాత్రం స్వాధీనం చేసుకోవడంలో స్థానిక అధికారులు చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ‘ఏజెన్సీ భూమి కబ్జా’ శీర్షికన నవంబరు 12న ’ఆంధ్రజ్యోతి’ జిల్లా అనుబంధంలో కథనం ప్రచురిత మైంది. కథనంపై స్పందించిన ఐటీడీఏ పీవో మరు నాడు దండేపల్లి తహసీల్దార్‌కు సమగ్ర విచారణ జరి పించాలని ఆదేశాలు జారీ చేశారు.

కబ్జా జరిగిందిలా....

ముత్యంపేట గ్రామం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గిరిజన చట్టాలైన 1/70, పేసా చట్టాలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ గిరిజనేతరులైన ఇద్దరు బడా వ్యక్తులు భూములను కబ్జా చేశారు. సర్వే నెంబరు 17లో 34 గుంటలతోపాటు దాని సమీపంలోని సర్వే నెంబరు 18లో మరో ఆరు గుంటల భూమిని క బ్జా చేసిన ఓ బడా వ్యాపారి ఏకంగా రైస్‌మిల్లు నిర్మిం చాడు. ఏజెన్సీ భూమి కబ్జా పర్వాన్ని ’ఆంధ్రజ్యోతి’ కథ నం ద్వారా వెలుగులోకి తెచ్చింది. ముత్యంపేట గ్రామం లో ఏజెన్సీ భూములను గిరిజనేతరులు ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం గ్రామ పంచా యతీ ట్రేడ్‌ లైసెన్స్‌ కూడా పొందకుండా మినీ రైస్‌మి ల్లు ఏర్పాటు చేశారు. అదే భూమిని ఉట్నూరు లోని ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఇళ్లు లేని పలువురు గిరిజను లకు ఇంటి స్థలాల కోసం కేటాయిస్తూ గతంలో ఆదేశా లు జారీ చేశారు. పీవో ఆదేశాల మేరకు భూ మిని ఇళ్లు లేని పేదలకు పంచాల్సి ఉండగా, స్థానిక రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి అన్యాక్రాంతం అ య్యాయి. ఈ విషయమై గ్రామస్థులు కొందరు అక్టోబ రు 28న కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్‌ సూచనల మేరకు జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతీలాల్‌ నవంబరు 26న అక్రమంగా రైస్‌ మిల్లు ఏర్పాటు చేసిన స్థలంపై పూర్తిస్థాయిలో విచారణ జ రపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. లేఖ ఇచ్చిన నా టి నుంచి గరిష్టంగా 7 రోజుల లోపు నివేదిక సమ ర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌ ఇచ్చిన గడువు ముగియడం, రెవెన్యూ అధికారులు స ర్వే చేపట్టకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో గిరిజనులు డిసెంబరు 11న ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాను కలిసి ఏజెన్సీ భూమిని కాపాడాలని ఫిర్యాదు చేశారు.

పీవో ఆదేశాలతో కదిలిన యంత్రాంగం....

ఓ వైపు కలెక్టర్‌, మరోవైపు ఐటీడీఏ పీవో ఆదేశాలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మండల రెవెన్యూ యంత్రాంగం కదిలింది. జనవరి 2న మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భూమన్న, సర్వేయర్‌ వినోద్‌, సదరు భూ ముల్లో సర్వే జరిపారు. విచారణలో సర్వే నెంబరు 17 లో మొత్తం 1.12 ఎకరాల ఏజెన్సీ భూములు కబ్జాకు గురైనట్లు అధికారులు నిర్దారించారు. అందులో గతంలో గిరిజనులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన 34 గుం టల భూమి కూడా ఉన్నట్లు తేల్చి, బౌండరీలు ఏర్పా టు చేశారు. కబ్జాకు గురైన 34 గుంటల్లో 10 గుం టల తోపాటు దాని పక్కనే ఉన్న సర్వే నెంబరు 18లో నూ మరో 35 గుంటలు చెరబట్టిన వ్యాపారి ఆ మొత్తం స్థ లంలో రైస్‌ మిల్లును నిర్మించాడు. భూముల సర్వే పూ ర్తికావడంతో సంబంధిత నివేదికను తహసీల్దార్‌ ఐటీడీ ఏ పీవోకు అందజేశారు. స్పందించిన పీవో కబ్జాకు గురైన ఏజెన్సీ భూమిని ప్రభుత్వ కస్టడికి తీసు కోవాలంటూ ఫిబ్రవరి 6న తహసీల్దార్‌కు ఆదేశాలు జా రీ చేశారు. భూమిని స్వాధీనం చేసుకొనే క్రమంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు బం దో బస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

మూడు నెలలైనా ముందుకు సాగని ప్రక్రియ....

స్థలాన్ని కస్టడీకి తీసుకోవాలన్న ఐటీడీఏ పీఓ ఆదేశాలను అధికారులు బుట్టదాఖలు చేశారు. మూడు నెలలు గడుస్తున్నా భూములను స్వాధీనం చేసుకోవ డానికి చర్యలు చేపట్టడంలేదు. గిరిజన భూములు కావడంతో పోలీస్‌శాఖ బందోబస్తు కోరామని, రెవెన్యూ అధికారులు చెబుతుండగా, బందోబస్తు ఏర్పాటు చే సేందుకు తమశాఖ సిద్ధంగా ఉందని పోలీసులు చె బుతున్నారు. రెండు శాఖల సమన్వయ లోపంతో గిరి జన భూములు కబ్జాకోరుల చెరలోనే కొట్టుమిట్టాడు తుండగా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ పీ ఓల ఆదేశాలు బేఖాతర్‌ అయ్యాయి. భూముల స్వా ధీనం విషయంలో స్థానిక నాయకులు కొందరు ఇరు శాఖల అధికారులకు చర్యలు తీసుకోకుండా అడ్డుపడు తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికై నా రెండు శాఖలు సమన్వయంతో పనిచేసి ఆక్రమిత గిరిజన భూములను స్వాధీనం చేసుకోవడంతోపాటు, కబ్జాకోరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బందోబస్తు కోసం లేఖలు రాశాను....సంధ్యారాణి, తహసీల్దార్‌

కబ్జాకు గురైనవి ఏజెన్సీ భూములు కావడంతో స్వా ధీనపరుచుకొనే క్రమంలో శాంతిభద్రతల సమస్య త లెత్తే అవకాశం ఉంది. దీంతో బందోబస్తు ఏర్పాటు చే యాలంటూ రెండు నెలల క్రితం ఒకమారు, 15 రోజుల క్రితం మరోమారు పోలీస్‌శాఖకు రెండు సార్లు లేఖలు రాసాము. పోలీస్‌శాఖ ప్రొటెక్షన్‌ ఇస్తే భూములు స్వాధీనం చేసుకోవడానికి సిద్దంగా ఉన్నాం.

తహసీల్దార్‌ కోరితే బందోబస్తు ఏర్పాటు చేస్తాం..

దండేపల్లి ఎస్సై తహసీనోద్దీన్‌

బందోబస్తు కోసం తహసీల్దార్‌ లేఖ రాసిన విష యం వాస్తవమే. అయితే మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తరువాత వివిధ రకాల పరీక్షల కారణం గా సిబ్బంది ఆ డ్యూటీల్లో నిమగ్నమై బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యేక విధులు ఏవీ లేనందున తహసీల్దార్‌ బందోబస్తు కావాలని కోరితే తప్పకుండా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

Updated Date - May 13 , 2025 | 11:23 PM