‘సాగు’ ముడి వీడేదెన్నడు...?
ABN, Publish Date - May 26 , 2025 | 11:12 PM
అటవీ ప్రాం తాల సమీపంలోని భూములు సాగు చేసుకునేం దుకు ప్రభుత్వాలు వారికి అవసరమైన పట్టా పాసుపుస్తకా లు జారీ చేశాయి. వాటిపైనే ఆధారపడి వందలాది కు టుంబాలు నేటికీ జీవనాధారం పొందుతున్నాయి.
-పట్టా పాసుపుస్తకాలున్నా సాగుకు నో
-గతంలోనే హక్కు పత్రాలు జారీ చేసిన ప్రభుత్వం
-అటవీ భూముల పేరుతో అడ్డుకుంటున్న అధికారులు
-బాధితుల్లో దళితులు, గిరిజన రైతులే అధికం
-జీవనాధారం లేకుండా పోయిందంటూ ఆవేదన
-ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకోలు
మంచిర్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాం తాల సమీపంలోని భూములు సాగు చేసుకునేం దుకు ప్రభుత్వాలు వారికి అవసరమైన పట్టా పాసుపుస్తకా లు జారీ చేశాయి. వాటిపైనే ఆధారపడి వందలాది కు టుంబాలు నేటికీ జీవనాధారం పొందుతున్నాయి. అ యిన్పటికీ సాగులో ఉన్నవి అటవీ భూములనీ, వాటి లో వ్యయసాయం చేయడానికి వీల్లేదంటూ ఫారెస్ట్ ఆ ఫీసర్లు హుకుం జారీ చేస్తున్నారు. తమకు అన్ని ఆధా రాలు ఉన్నాయని, ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిం చే వారిని జైలుపాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నా యి. జిల్లాలోని వేమనపల్లి, భీమిని, నెన్నెల, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో ఈ విధమైన సాగు వివాదం నెలకొనగా, న్యాయం చేయాలంటూ బాధితు లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ’సాగు ముడి’ వ్య వహారం వెలుగులోకి వచ్చింది.
అటవీ భూముల పేరుతో....
ఆయా మండలాల్లోని అటవీ భూముల్లో అక్రమంగా వ్యయసాయం చేస్తున్నారనే ఉద్దేశ్యంతో ఫారెస్ట్ అధికా రులు రైతులను అడ్డుకుంటున్న సందర్భాలు జిల్లాలో అనేకం వెలుగు చూస్తున్నాయి. పోడు వ్యవసాయం పే రుతో అడవులను నరికివేస్తూ వ్యవసాయ భూము లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని దాడులు జరు పుతున్నారు. వాస్తవానికి ఎలాంటి హక్కు పత్రాలు లేక పోయినా కొన్ని ప్రాంతాల్లో రైతులు పోడు వ్యవసా యం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా తాము అటవీ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామంటూ అటవీ ప్రాంతాల రైతులు వాధిస్తున్నారు. సాగులో ఉన్న అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆందోళనకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎ లాంటి హక్కులు లేవు కాబట్టి వారిని అటవీశాఖ అధి కారులు వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడం, కేసు లు నమోదు చేయడం జరగుతోంది. ఇంతవరకు బాగా నే ఉన్నా....ప్రభుత్వాలు పట్టా, పాసు పుస్తకాలు జారీ చేసనప్పటికీ కొన్ని చోట్ల అటవీ అధికారులు రైతులను అడ్డుకుంటున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తు న్నాయి. అక్రమంగా పోడు వ్యవసాయం చేస్తున్నారం టూ జిల్లాలోని వేమనపల్లి మండలం చామనపల్లి గ్రా మానికి చెందిన తొమ్మిది మంది రైతులపై కేసులు న మోదు చేసిన అటవీశాఖ అధికారులు 2024 డిసెం బరులో వారిని జైలుకు కూడా పంపారు.
హక్కు పత్రాలు జారీ చేసిన ప్రభుత్వాలు...
వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామంలో నిరు పేద దళిత, బలహీన వర్గాలకు చెందిన పలువురికి 1997లో అప్పటి ప్రభుత్వం అటవీ ప్రాంతాల సమీపం లోని భూములను అసైన్డ్ చేసి, సాగు చేసుకునేందుకు హక్కు పత్రాలు జారీ చేసింది. చామనపల్లి శివారులోని సర్వే నెంబర్ 65,67లో దశాబ్దాలుగా సాగు చేసుకుం టున్న వారికి ప్రభుత్వం ఫైనల్ పట్టా జారీ చేసింది. అ ప్పటి నుంచి పై సర్వే నెంబర్లలోని సుమారు 600 ఎ కరాల్లో లబ్దిదారులు సాగు చేస్తున్నారు. ఆ ఆరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కూడా అప్పటి ప్రభుత్వం 2018లో కొత్త పట్టా పాసు పుస్తకాలు మం జూరు చేసింది. వర్షాధార భూములు కావడంతో ప్రతి వానాకాలంలో ఆయా భూములను లబ్దిదారులు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తుండటంతో భూములను సిద్ధం చేసుకొనేందుకు వెళ్లిన రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నట్లు చెబుతున్నారు. ఆయా భూముల్లో రైతులు బోర్లు, స్తంబాలు, విద్యుత్ మోటార్లు కూడా ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తు న్నారు. ఇదే పద్దతిలో నెన్నెల, భీమిని, భీమారం, చె న్నూరు, కోటపల్లి మండలాల్లోనూ సుమారు ఐదు వేల ఎకరాల్లో రైతులు అటవీప్రాంత భూములను సాగు చే సుకుంటుండగా, వారిలో చాలా మందికి హక్కు పత్రా లు ఉన్నప్పటికీ అటవీ అధికారులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కలెక్టర్‌కు ఫిర్యాదుతో వెలుగులోకి....
తెలంగాణ ప్రభుత్వం నుంచి పట్టా పాసు పుస్తకాలు పొందిన తరువాతనే తాము అటవీ ప్రాంత భూముల్లో సాగు చేసుకుంటున్నామని, అయినప్పటికీ అటవీ అధి కారులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ సోమవారం చామనపల్లి గ్రామస్థులు పలువురు కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన పాసు పుస్తకాలను వారు ప్రదర్శించారు. భూములను సాగు చేస్తే కేసులు పెడతామని అటవీ అధికారులు బెదిరి స్తున్నారని ఫిర్యాదు చేశారు. అట వీశాఖ అధికారులు తమ భూముల్లోకి రాకుండా, తమపై అక్రమ కేసులు నమోదు చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవ డం ద్వారా తమకు న్యాయం చేయాలని కోరుతూ క లెక్టర్‌కు విన్నవించడంతో విషయం వెలుగులోకి వచ్చిం ది. ఇప్పటికైనా హక్కులు పత్రాలు ఉన్న వారికి అటవీ ప్రాంత భూములు సాగు చేసుకునేలా న్యాయం జరు గుతుందో...లేదో వేచి చూడాలి.
Updated Date - May 26 , 2025 | 11:12 PM