ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక ఎక్కడి ఉద్యోగులు అక్కడే

ABN, Publish Date - Jul 02 , 2025 | 12:00 AM

అక్రమ ఆదాయం కోసం దొడ్డిదారిన ఇష్టమొచ్చిన చోట పనిచేస్తూ ప్రభుత్వ నిబంధనలకు బేఖాతరు చేసిన విద్యుత్‌శాఖ ఉద్యోగులపై శాఖపర చర్యలు మొదలయ్యాయి.

శాఖాపర విచారణ చేసిన అధికారులు

దొడ్డిదారిన పనిచేస్తున్న ఉద్యోగులపై చర్యలు

దిద్దుబాటు చర్యలు చేపట్టిన విద్యుత్‌శాఖ

నల్లగొండ/నల్లగొండ టౌన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అక్రమ ఆదాయం కోసం దొడ్డిదారిన ఇష్టమొచ్చిన చోట పనిచేస్తూ ప్రభుత్వ నిబంధనలకు బేఖాతరు చేసిన విద్యుత్‌శాఖ ఉద్యోగులపై శాఖపర చర్యలు మొదలయ్యాయి. గత నెల 30న ‘ఆంధ్రజ్యోతి’లో ‘కొలువు ఒక చోట, విధులు నచ్చిన చోట’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దీనిపై ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి నివేదికను రూపొందించారు. లైన్‌మెన్‌లు, ఆపరేటర్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది అసలు పోస్టింగ్‌లు ఎక్కడ? వారు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు? అనే దానిపై ఆరా తీశారు. మునుగోడు విద్యుత్‌ శాఖ సబ్‌ డివిజన్‌లోని గట్టుప్పల్‌, చండూరు, మునుగోడు మండలాల్లో ఉద్యోగులు వారికి కేటాయించిన చోటకాకుండా అంతర్గత ఒప్పందాలతో కొన్నేళ్లుగా నచ్చినచోట పనిచేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ బిల్లింగ్‌ ప్రక్రియ నడుస్తుండటంతో వారు ఈనెల 7వ తేదీ తరువాత పోస్టింగ్‌ ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మంగళవారం నుంచి సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లు యథావిధిగా వారికి కేటాయించిన ప్రాంతంలో పనిచేయాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వారంతా ఆయా సబ్‌స్టేషన్లకు వెళ్లి విధుల్లో చేరారు.

Updated Date - Jul 02 , 2025 | 12:00 AM