పీఎస్ హెచ్‌ఎం పోస్టుల భర్తీ ఎప్పుడు..?
ABN, Publish Date - Apr 27 , 2025 | 11:25 PM
విద్యారం గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న అనేక సమస్యలు గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా పరిష్కారానికి నో చుకోలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, తెలంగాణలో 2వ పీ ఆర్సీ, పెండింగ్ డీఏల ప్రకటన, ప్రాథమిక పాఠశా లల్లో పీఎస్ హెచ్‌ఎం పోస్టుల భర్తీ వంటి అనేక స మస్యలకు పరిష్కారం చూపకపోవడంతో విద్యారం గంపై తీవ్ర ప్రభావం చూపింది.
-10వేల పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం హామీ
-20 ఏళ్లుగా ఎస్జీటీల ఎదురు చూపులు
-మంచిర్యాలలో పదోన్నతికి నోచుకోని ఉపాధ్యాయులు
-ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేడుకోలు
మంచిర్యాల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): విద్యారం గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న అనేక సమస్యలు గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా పరిష్కారానికి నో చుకోలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, తెలంగాణలో 2వ పీ ఆర్సీ, పెండింగ్ డీఏల ప్రకటన, ప్రాథమిక పాఠశా లల్లో పీఎస్ హెచ్‌ఎం పోస్టుల భర్తీ వంటి అనేక స మస్యలకు పరిష్కారం చూపకపోవడంతో విద్యారం గంపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్యారంగం పట్ల దృష్టి సారించడంతో ఉపాధ్యాయ లోకానికి ఊరట లభించి నట్లయింది. ప్రస్తుత ప్రభుత్వం భాషా పండితులు, పీఈటీల ఉన్నతీకరణ చేపట్టడంతో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆయా విభాగాలకు చెందిన ఉపాధ్యా యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,479 పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు రా ష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భాషా పండితులు, పీఈటీల పదోన్నతి ప్ర క్రియ కూడా పూర్తికాగా, గ్రేడ్-1 స్థానం లభించింది.
స్థానం దక్కని ఎస్జీటీలు...
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగరీల ఉపాఽధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రభుత్వం సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీలు)కు మాత్రం స్థానం కల్పించకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ, నిస్ప్రహ ల్లో ఉన్నారు. ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తానని ప్రకటిం చిన 10,479 పోస్టుల్లో తెలుగు-4493, హిందీ-3883, పీఈటీ-1778 ఉన్నాయి. మిగతా కొన్ని ఇతర మైనర్ మీడియం పోస్టులు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా వి షయానికి వస్తే తెలుగు-115, హిందీ-110, పీఈటీ-33 పోస్టులను గ్రేడ్-1గా అప్‌గ్రేడ్ చేశారు. అప్‌గ్రేడేషన్ తరువాత జిల్లాలో అతికొద్ది మంది మాత్రమే గ్రేడ్-2 ఉపాధ్యాయులుగా మిగిలిపోయారు. ప్రభుత్వ నిర్ణ యం పట్ల భాషా పండితులు, పీఈటీలు ఆనం దం వ్యక్తం చేస్తుండగా, ఏన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం వేచి చూస్తున్న ఎస్జీటీలు మాత్రం నిరుత్సా హానికి గురవుతున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం అర్హ త కలిగిన ఎస్జీటీలకు అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో మొం డిచేయి చూపి, తమకు రావలసిన పదోన్నతులను దూరం చేశారని, అర్హతగల ఎస్జీటీలు వాపోతున్నా రు. గతంలో కామన్ సీనియారిటీతో పదోన్నతులు తీ సుకున్నప్పటికీ కూడా అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో సం ఘాలు ఎస్జీటీలకు మొండి చేయి చూపారని విచా రం వ్యక్తం చేస్తున్నారు. అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూ ర్తయి, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయు లు అందరూ పదోన్నతులు పొందినప్పటికీ, ఎస్జీటీల కు తదుపరి అవకాశం కల్పిస్తూ జీవో సవరించడం లో కృషి చేయడంలేదని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎస్జీటీలు ప్రభుత్వంతోపాటు యూనియన్లపై ఆగ్ర హంతో ఉన్నారు. అప్‌గ్రేడేషన్‌లో అర్హత కలిగి ఉ న్నందున ఎస్జీటీలు తమకు కూడా అవకాశం కల్పిం చాలని పోరాటం చేస్తున్నారు. అప్‌గ్రేడేషన్ కంటే ముందున్న ఖాళీగా ఉన్న సుమారు వెయ్యి పోస్టుల్లో కూడా న్యాయపరంగా ఎస్జీటీలకు పదోన్నతి కల్పించే అవకాశం ఉన్నా సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క నీసం పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసే లోపై నా పదోన్నతులు కల్పించాలనే డిమాండ్లు ఉన్నాయి.
పీఎస్ హెచ్‌ఎం పోస్టుల కోసం ఎదురు చూపులు...
గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 10వేల పీఎస్ హెచ్‌ఎం పోస్టులు భర్తీ చేస్తే కొంతవ రకైనా తమ సమస్యలు తీరుతాయనే భావనలో ఎస్జీ టీలు ఉన్నారు. అలాగే ఉన్నత పాఠశాలల మాదిరిగా ప్రాథమిక పాఠశాల్లో కూడా పీఎస్ హెచ్‌ఎం పోస్టు లు మంజూరు చేస్తే బోధనేతర పనులు చూసుకోవ డానికి వీలు కలుగుతుందని, తద్వారా ప్రాథమిక పా ఠశాలల ఉపాధ్యాయులు విద్యాబోధన మీద ధృష్టిపె ట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 20 నుంచి 30 ఏళ్లపాటు పని చేస్తూ ఎలాంటి పదోన్నతులకు నోచుకోని ఎస్జీటీలకు ప్రతి పాఠశాలలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు ఇవ్వడం వల్ల పదోన్న తుల అవకాశం పెరిగి సంతృప్తి చెందుతారని భావి స్తున్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే జిల్లాలో దాదాపు మరో 150 మంది వర కు ఎస్జీటీలకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. ప్రభు త్వం హామీ ఇచ్చిన విధంగా 10వేల పోస్టులు మం జూరు చేసి ఎస్జీటీలకు న్యాయం, తద్వారా ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
పోస్టులు మంజూరు చేయాలి...ఆళ్ల రాజేంధర్,
సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంట నే 10వేల వరకు పీఎస్ హెచ్‌ఎం పోస్టులను మం జూరు చేయాలి. ఈ పోస్టులను అర్హతగల అందరు ఎస్జీటీలకు కేటాయించాలి. తద్వారా ప్రాఽథమిక పాఠ శాలలను బలోపేతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చొర వ తీసుకొని సుప్రీం కోర్టులో కేసు వేయడం ద్వారా న్యాయ వివాదాలను పరిష్కరించాలి. అప్‌గ్రేడ్ అయి న భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పో స్టులలో జీవోలు సవరించి మళ్లీ ఎస్జీటీలకు పదోన్న తులకు అవకాశం కల్పించాలి.
Updated Date - Apr 27 , 2025 | 11:25 PM