ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సహకార సంఘాల విస్తరణ ఎప్పుడో...?

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:34 PM

రైతులకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) విస్తరణలో తీవ్ర జాప్యం జరు గుతోంది.

-బుట్టదాఖలైన గత ప్రతిపాదనలు

-కొత్త మండలాల్లో ఏర్పాటుకాని పీఏసీఎస్‌లు

-సహకార సంఘాలపై దృష్టిసారించని రాష్ట్ర ప్రభుత్వం

జిల్లాలో అదనంగా 16 పీఏసీఎస్‌ల ఏర్పాటుకు అవకాశం

మంచిర్యాల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రైతులకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) విస్తరణలో తీవ్ర జాప్యం జరు గుతోంది. రైతులకు పంట రుణాలు, రాయితీపై విత్తనా లు, ఎరువులు అందిస్తూ అండగా నిలవడం సహకార సంఘాల విధి. గత బీఆర్‌ఎస్‌ హయాంలో జిల్లాలో కొ త్త సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చి నా...అవి బుట్టదాఖలు కావడంతో విస్తరణకు నోచుకోలే దు. కొత్తవి ఏర్పాటు చేయకపోయినా...కనీసం ఉన్నవా టిని కూడా బలోపేతం చేయకపోవడంతో రైతులకు వా టి సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ప్ర స్తుతం ఉన్న ప్రాథమిక సంఘాల పరిధి ఎక్కువగా ఉం డటంతోపాటు గ్రామాలకు దూరంగా ఉండటంతో రైతు లకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో కొత్తగా ఏర్పా టైన మండలాల్లో సహకార సంఘాలు లేకపోవడంతో ఆయా మండలాల రైతులు ఇతర మండలాల్లోని సొసై టీలకు వెళ్లాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా జిల్లాలో కొన్ని సొసైటీల పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉండగా, మరికొ న్ని సొసైటీలకు తక్కువ గ్రామాలు ఉన్నాయి. దీంతో దూరంగా ఉన్న సొసైటీలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతిపాదనల దశలో నిలిచిన విస్తరణ....

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జిల్లాలు, మం డలాల పునర్విభజన జరిగిన అనంతరం ఆ మేరకు రైతులకు సహకార సేవలను మరింతగా పెంచేందుకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సహకార సంఘాల విస్తర ణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సహకార శా ఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అధి కారులు క్షేత్రస్థాయిలో అద్యయనం చేసి, గ్రామాల్లో స భలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను కూడా సేక రించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న సహకార సంఘా లకు అదనంగా ఎన్ని అవసరం అవుతాయో అంచనా వేసి ప్రతిపాదనలు తయారు చేశారు. సంబంధిత ని వేదికలను ప్రభుత్వానికి పంపారు. దీంతో సహకార సంఘాల విభజనకు రంగం సిద్ధంకాగా, డ్రాఫ్టు నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. సహకార సంఘాల విభజనే తరువాయి అనుకుంటున్న తరుణంలో ప్రభు త్వ నిర్ణయం మరుగున పడింది. 2020 ఫిబ్రవరి 15న ప్రభుత్వం సహకార ఎన్నికలను నిర్వహించింది. ఎన్ని క ల సమయంలోనే సంఘాలను విస్తరించాలని ప్రతి పా దించగా, కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విస్త రణ ప్రక్రియ ముందుకు సాగలేదు.

నూతన విధానానికి మంగళం....

సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ సహకార విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం ప్రతి గ్రామానికి ఒక ప్రాథమిక సహకార సంఘం, ఒక మత్స్య సహకార సం ఘం, ఒక పాల ఉత్పత్తి సహకార సంఘం ఉండాలనేది ఈ నూతన సహకార విధానం ఉద్దేశ్యం. కేంద్ర సహకా ర శాఖ మంత్రిగా అమిత్‌షా బాధ్యతలు చేపట్టిన త రువాత ఏర్పాటు చేసిన జాతీయ సహకార సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నూతన విధానాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు కూడా అమిత్‌ షా సూచన లు చేశారు. గత ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకో వడంతో నూతన విధానానికి మంగళం పాడినట్లయింది. ఈ విషయంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా సా నుకూలంగా స్పందిస్తుందో...లేదోనన్న స్పష్టత రావలసి ఉంది.

విభజిస్తేనే సేవలు విస్తృతం...

వ్యవసాయంలో రైతులకు అన్ని రకాలుగా వెన్నుద న్నుగా ఉండే సహకార సంఘాల సేవలను మరింతగా విస్తరిస్తేనే మరింతగా ప్రయోజనం కలుగుతుందనే అ భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబా టులో ఉండేలా సొసైటీలను విభజించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి. ఒక్కో సొసైటీలో వేలాది మంది రైతులు స భ్యులుగా ఉండగా, ఏ అవసరం వచ్చినా క్యూలు కట్టా ల్సి వస్తోంది. ప్రతి సీజన్‌ ఆరంభంలో ఎరువులు, విత్త నాల కోసం రైతులు బారులు తీరిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, వాటి పదవీ కాలం వా స్తవంగా 2025 ఫిబ్రవరి 15తో ముగిసింది. దీంతో ప్రభు త్వం ఆరు నెలలపాటు గడువు పొడిగించింది. ఆ గడు వు కూడా వచ్చేనెల 15తో ముగియనుంది. ఇకనైనా ఎ న్నికలు నిర్వహిస్తారో...లేదో తెలియకుండా ఉంది. అయి తే సహకార సంఘాల ఎన్నికలకు ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగా సహకార సంఘాల ఎన్నికలు మరింతగా ఆలస్యం కానున్నాయి. ఈ క్రమంలో సహకార సంఘాల పదవీకాలం మరోమారు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం సహకార సంఘాలను విస్తరిస్తే జిల్లాలో మ రో 16 సంఘాలు కొత్తగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అప్పుడు జిల్లాలోని రైతులకు సహకార సంఘాల సేవ లు సైతం విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వమైనా సహకార సంఘాల విస్తర ణను సానుకూల ధృక్పథంతో చూడాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:34 PM