సన్నాలకు బోనస్ ఎప్పుడు...?
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:21 PM
యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన సన్నధాన్యం బోనస్ చె ల్లింపులపై ప్రభుత్వం ఊసే ఎత్తడం లేదు. ధాన్యం డ బ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ బోనస్‌పై ప్రభుత్వం నుంచి ప్రకటన లేకపోవడంతో రైతులు ఇ బ్బందులు పడుతున్నారు.
కోనుగోళ్లు పూర్తయినా ప్రారంభం కాని బోనస్ చెల్లింపులు
నగదు కోసం రెండు నెలలుగా రైతుల ఎదురు చూపు
వానాకాలం సాగుకైనా నగదు అందించాలని విన్నపం
జిల్లాలో రూ.2.29 కోట్ల బకాయిలు
మంచిర్యాల, జూన్24 (ఆంధ్రజ్యోతి): యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన సన్నధాన్యం బోనస్ చె ల్లింపులపై ప్రభుత్వం ఊసే ఎత్తడం లేదు. ధాన్యం డ బ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ బోనస్‌పై ప్రభుత్వం నుంచి ప్రకటన లేకపోవడంతో రైతులు ఇ బ్బందులు పడుతున్నారు. సన్నరకం ధాన్యం విక్రయిం చిన రైతులు బోనస్ డబ్బుల కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా జిల్లాలో యాసంగి సీజన్‌లో రైతులు అధికంగా సన్న రకం సాగు చేశారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుందన్న న మ్మకంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మకుం డా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా ల్లోనే విక్రయాలు చేశారు. ధాన్యం డబ్బులు కొనుగోలు చేసిన పది రోజుల్లోపే రైతుల ఖాతాల్లో జమ చేసినప్ప టికీ బోనస్ డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
యాసంగిలో భారీగా సన్నరకం సాగు....
జిల్లాలో యాసంగి సీజన్‌లో 3లక్షల పై చిలుకు ఎ కరాల్లో వరి సాగు చేయగా ఇందులో 5880 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కూడ ఉంది. జిల్లా వ్యాప్తంగా 340 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధా న్యం కొనుగోలు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 841 మంది రైతుల నుంచి 5880 మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.500 బోనస్ చొప్పున రూ.2.29 కోట్లను సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే జిల్లా లో యాసంగి కొనుగోళ్లు పూర్తయి రెండు నెలలు గడు స్తున్నా ప్రభుత్వం సన్నరకాలకు బోనస్ డబ్బులు మా త్రం జమ చేయలేదు. ఏప్రిల్ నుంచి సన్నరకం అమ్మి న రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయి న తరువాత బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటిం చడంతో ఎప్పుడు జమ చేస్తారో అని ఆశతో ఎదురు చూస్తున్నారు.
వానాకాలం సాగుకు అందని బోనస్...
సన్నరకం ధాన్యం మీద ప్రభుత్వ ప్రకటించిన క్విం టాకు రూ.500 బోనస్ సకాలంలో అందితే వానాకాలం సాగుకు అందుతాయనే భావనలో రైతులు ఉన్నారు. జిల్లాలో వానాకాలం సాగు ప్రారంభమైనప్పటికీ బోనస్ డబ్బులు చేతికి అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 2024-25 వానాకాలం సీజన్‌లో మొత్తం 1,58,161 ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా. దీనికి సంబంధించిన ప నులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వానాకాలం సా గుకోసం రైతులు ఎకరాకు రూ.40వేల వరకు ఖర్చు చే యనున్నారు. ట్రాక్టర్ కిరాయిలు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులతో సాగు పూర్తయ్యే సరికి అంత మొ త్తం ఖర్చు చేయాల్సి ఉంది. అయితే యాసంగి సీజన్ కు సంబంధించిన సన్నరకం బోనస్ డబ్బులు ఈలోగా రైతుల ఖాతాల్లో జమ అయితే వానాకాలం సీజన్‌కు ఉపయోగపడేవి. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తే సా గు ఖర్చుల్లో కొంతమేరకైన రైతులకు ఉపశమనం ల భించేది. ప్రభుత్వం ఇప్పటికీ బోనస్ డబ్బులపై ప్రకట న చేయకపోవడంతో ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి.
Updated Date - Jun 24 , 2025 | 11:21 PM