సాగునీరు అందేదెప్పుడు?
ABN, Publish Date - May 29 , 2025 | 11:57 PM
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోగల గొల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సాగునీరు అందివ్వని స్థితిలో ఉంది. ప్రాజెక్టు ప్రధాన కాలువకు అనుసంధానంగా నిర్మించిన పిల్ల కాలువల నిర్మాణంలో డిజైన్ లోపం కారణంగా నీరు పారకుండా వృథాగా పడిఉన్నాయి.
- డిజైన్ లోపంతో వృథాగా మారిన గొల్లవాగు ప్రాజెక్టు కాలువలు
- ప్రధాన కాలువకంటే ఎక్కువ ఎత్తులో నిర్మాణం
- అధికారుల తప్పిదంతో రైతులకు ఇబ్బందులు
- పునర్నిర్మాణం చేపడితేనే సాగుకు యోగ్యం
మంచిర్యాల, మే 29 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోగల గొల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సాగునీరు అందివ్వని స్థితిలో ఉంది. ప్రాజెక్టు ప్రధాన కాలువకు అనుసంధానంగా నిర్మించిన పిల్ల కాలువల నిర్మాణంలో డిజైన్ లోపం కారణంగా నీరు పారకుండా వృథాగా పడిఉన్నాయి. సుమారు రెం డు దశాబ్దాల క్రితం భీమారం మండలంలో రూ. 83 కోట్ల అంచనా వ్యయంతో ఐదు టీఎంసీల సామర్థ్యంతో గొల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టును నిర్మించారు. భీమా రం, చెన్నూరు మండలాల్లోని 9,500 ఎకరాలు ఆయక ట్టుకు నీరందేలా రూపకల్పన చేశారు. ప్రధాన కాలు వల పొడవు 26 కిలోమీటర్లు ఉండగా, మొత్తం 39 డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేశారు.
ఫ డిజైన్ లోపంతో..
గొల్లవాగు ప్రాజెక్టు ద్వారా చెన్నూరు మండలంలోని ఒత్కులపల్లి, ఆస్నాద్, దుగ్నెపల్లి, సుందరశాల, అంగరా జుపల్లి, చెల్లాయిపేట, కొమ్మెర, ఎర్రగుంట పల్లితోపాటు భీమారం మండలంలో సాగునీరు అందించాల్సి ఉంది. అధికారులు రూపొందించిన డిజైన్ కారణంగా ప్రధాన కాలువకు అనుసంధానంగా భీమారం మండలంలో ని ర్మించిన నాలుగు పిల్ల కాలువలకు నీరు రావడంలేదు. ప్రధాన కాలువ కంటే పిల్ల కాలువలను ఎక్కువ ఎత్తు లో నిర్మించడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో దాదా పు 500 ఎకరాల్లో ఆయకట్టు రైతులు ప్రతి వానాకాలం సీజన్‌లో సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ప్ర ధాన కాలువకు అడ్డంగా ఇసుక బస్తాలు వేయడం ద్వారా పిల్ల కాలువలకు నీళ్లు మళ్లిస్తున్నారు. ఈ కార ణంగా మిగతా గ్రామాలకు నీరందక అక్కడి రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో భీమారం మం డల కేంద్రంలో కాలువకు అడ్డంగా వేసిన ఇసుక బ స్తాలను రైతులు తొలగిస్తున్నారు. పదిహేను సంవత్స రాలుగా ఇదే తంతు జరుగుతున్నా భీమారం రైతుల మొర ఆలకించే నాథుడే కరువయ్యారు. వానాకాలం సీజన్‌లో నీరందక భూములను రైతులు ఖాళీగా వది లివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు నిర్మా ణ సమయంలో తమ భూములను త్యాగం చేసినప్ప టికీ మిగిలిన పొలాలకు కూడా నీరందడంలేదని భీమా రం రైతులు వాపోతున్నారు. అధికారుల తప్పిదంవల్ల తమ భూములు బీడు ఉంచాల్సిన పరిస్థితులు నెల కొన్నాయని ఆవేదన చెందుతున్నారు.
ఫ హైలెవల్ కాలువ నిర్మిస్తేనే..
భీమారం ఆయకట్టు రైతులకు సాగునీరు అందిం చాలంటే ఆ ప్రాంతంలో హైలెవల్ కెనాల్ నిర్మించాలనే అభిప్రాయాలను ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కోటి రూపాయలు ఖర్చుచేసి సుమారు రెండు కిలోమీటర్ల పొడవు ఎక్కువ ఎత్తులో మరో కాలువ నిర్మించాలని, అప్పుడే పిల్ల కాలు వల కు నీరు చేరి భూములు సాగయ్యే అవకాశాలు ఉంటాయని అభిప్రాయ పడుతున్నారు.
ఫ నూతన కాలువ నిర్మించాలి..
తగరం మల్లయ్య, ఆయకట్టు రైతు
ప్రధాన కాలువకు అడ్డంగా ఇసుక బస్తాలు వేస్తేనే మా పొలాలు పండే పరిస్థితి ఉంది. అలా నీటికి అడ్డు గా బస్తాలు వేయడం వల్ల దిగువన రైతులకు సక్రమం గా నీరందడంలేదు. దీంతో వారు బస్తాలను తొలగి స్తు న్నారు. ప్రతియేటా ఇదే తంతు జరుగుతోంది. ఆరుగా లం శ్రమించి సాగుచేసిన పంట చేతికి రాకుండానే ఎండిపోతుంది. ఎ క్కువ ఎత్తులో మరో కాలువ నిర్మిస్తేనే మా భూములు పారుతాయి. అం దుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలి. అలాగే ప్రాజెక్టు లో నీరుపూర్తిగా అడుగంటిపోయింది. పూడిక తీస్తే సరిపడా నీరు నిలు స్తుంది. పూడికతీత పనులు త్వరగా చేపట్టాలి.
Updated Date - May 29 , 2025 | 11:57 PM