kumaram bheem asifabad- ‘రైతు భరోసా’ ఇంకెప్పుడు?
ABN, Publish Date - Jun 12 , 2025 | 10:18 PM
జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధం చేస్తున్నారు. రైతులు చేన్లను చదును చేసుకోవడంతో పాటు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే సమ యమిది. గ్రామాల్లో విత్తనం పండగ తర్వాత విత్తనాలు విత్తుకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు.
- పెట్టుబడి సాయం కోసం దిక్కులు చూస్తున్న అన్నదాతలు
- విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు తప్పని తంటాలు
చింతలమానేపల్లి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధం చేస్తున్నారు. రైతులు చేన్లను చదును చేసుకోవడంతో పాటు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే సమ యమిది. గ్రామాల్లో విత్తనం పండగ తర్వాత విత్తనాలు విత్తుకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో రైతులకు యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి రైతు బంధు పథకం ద్వారా పంటల పెట్టుబడి కోసం సాయం అందిస్తూ వచ్చింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకం పేరును మారుస్తూ రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. గతంలో ఎకరానికి రూ. 5వేలు ఇచ్చేవారు. ప్రసుత్తం వెయ్యి పెంచి రూ. 6వేలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా రాకపోవడంతో గ్రామాల్లో ఇంకెప్పుడు ఇస్తార న్న వాదనలు విన్పిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయాన్ని అందిస్తే రైతులకు ఇబ్బందులు ఉండవంటున్నారు. కానీ మరింత జాప్యం చేస్తే పెట్టుబ డి లేక సాగు పనులు వెనుకబడిపోయే అవకాశం ఉం దంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరో సాపై ఊసెత్తకపోవడంతో అన్నదాతలు అయోమయా నికి గురవుతున్నారు.
- యాసంగిలో ఇలా.
జిల్లాలో యాసంగి సీజన్‌లో మొత్తం 1,42,155 మం ది రైతులు ఉండగా, ఇందులో నాలుగైదు ఎకరాల లో పు 87,062 మంది రైతులు రూ. 95,36,93,491 సాయం పొందారు. అయితే 55,093 మంది రైతులు ఇంకా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జనవరి నుండి ఏప్రిల్ వరకు విడతల వారీగా నాలుగైదు ఎకరాల లోపు రైతులకు సాయం అందజేయగా ఇంకా 50వేల పైచిలుకు రైతులు యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా ఇప్పటికే యాసంగి పెట్టుబడి రాని ఉండడం, మళ్లీ వానాకాలం సీజన్ ప్రారంభం కావడం, పెట్టుబ డిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
- ఏటా మే చివరలో..
జిల్లాలో రైతులు ఏటా మే చివరిలోనే వానాకాలం పంటల సాగు పనులను ప్రారంభిస్తారు. ఇప్పటికే సాగు సందడి కన్పిస్తురంరది. అయినా ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించడం లేదంటున్నారు. వానాకాల సీజన్‌కు ముందే పెట్టుబడి సాయాన్ని అంద జేసి ఉంటే విత్తనాలను, ఎువులను కొనుగోలు చేసుకొ ని సిద్ధంగా ఉంటారు. వర్షాలు కురవగానే పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ సహాయం అందించ డంలో ప్రతీ సారి జాప్యం జరగడంతో ప్రభుత్వ సహాయం అక్కరకు రాకుండా పోతుందన్న అభిప్రా యాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఉంటే కొంత మేరకైనా ఇబ్బం దులు తప్పేవని రైతులు చెబుతున్నారు. ఎలాగో అప్పు చేసి పంటలను సాగు చేస్తున్నా.. పెట్టుబడి సాయం ఆలస్యమైతే ఇతర అవసరాలకు ఖర్చయ్యే అవకాశం ఉందంటున్నారు. సమయానికి చేతిలో చిల్లి గవ్వ లేక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
- సమయానికి అందకుంటే..
సమయానికి ప్రభుత్వ సాయం అందకపోవడంతో రైతులకు మళ్లీ వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. అధిక వడ్డీలైనా అప్పులు చేయక తప్పడం లేదు. అప్పులు చేస్తూ ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. మే మొదటి వారంలోనే పెట్టుబడి సాయాన్ని అందజేస్తే రైతులకు కొంత ఉపయోగకరంగా ఉండేదనన్న వాదన లు విన్పిస్తున్నాయి. రైతులకు చేతిలో డబ్బులు ఉంటేనే ఎరువులను తరలించడం, విత్తనాలు కొనుగోలు, ట్రాక్టర్ యంత్రాలకు అద్దెలు చెల్లించడం, సేంద్రియ ఎరువుల తరలింపు వంటి పనులను చేపడుతారు. పెట్టుబడి సాయం సకాలంలో అందకపోవడంతో గత్యంతరం లేక రైతులు దళారుల వద్ద వడ్డీలకు అప్పులు తీసుకుంటు న్నారు. జిల్లాలోని పలువురు ఫైర్టిలైజర్ షాపు యజమానులు రైతులతో ముందస్తుగానే ఒప్పందాలు చేసుకుంటారు. పెట్టుబడికి అయ్యే ఖర్చంతా తాము ఇస్తామని పంటలు పండిన తర్వాత తాము చెప్పిన వడ్డీలు ఇవ్వాలని రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుం టున్నట్లు చెబుతున్నారు.
Updated Date - Jun 12 , 2025 | 10:18 PM