ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పీహెచసీ నిర్మాణమెప్పుడో?

ABN, Publish Date - May 05 , 2025 | 12:32 AM

కొత్త మండలం గా ఏర్పడిన గట్టుప్పల్‌ మండలాన్ని సమస్యలు వెం టాడుతున్నాయి.

గట్టుప్పల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భనవ నిర్మాణ ఏర్పాటుకు రెవిన్యూశాఖ కేటాయించిన స్థలం

పీహెచసీ నిర్మాణమెప్పుడో?

నిధులు మంజూరైనా ప్రారంభంకాని పనులు

వైద్యం కోసం పక్క మండల కేంద్రాలకు వెళ్తున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు

గట్టుప్పల్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): కొత్త మండలం గా ఏర్పడిన గట్టుప్పల్‌ మండలాన్ని సమస్యలు వెం టాడుతున్నాయి. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది మండల ప్రాథమిక ఆరో గ్య కేంద్రం పరిస్థితి. కొత్త మండలంలోని ప్రజలు వైద్య సదుపాయాలు కల్పించేందుకు మండల కేంద్రంలో పీహెచసీ నిర్మాణానికి గట్టుప్పల్‌ నుంచి వెల్మకన్నెకు వెళ్లే దారిలో ఒక ఎకరానికి పైగా స్థలా న్ని కేటాయించారు. అంతేకాక 15 ఫైనాన్స నిధుల నుంచి రూ. 1.43 కోట్లు నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ ఆస్పత్రి నిర్మాణానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకలేదు. దీంతో మండలంలో ని ప్రజలు ఆరోగ్యం కోసం చిన్నాచితక ఆర్‌ఎంపీలపై ఆధారపడటం లేదంటే పక్క మండల కేంద్రాలకు వెళ్తున్నారు. వైద్యానికి చండూరు, మర్రిగూడ, మునుగోడు వెళ్లాల్సిన పరిస్థితి.

తేరట్‌పల్లి, కమ్మగూడెం, శేరిగూడెం, గట్టుప్పల్‌ గ్రామాల ప్రజలు తమ పాత మండలమైన చండూరుకు వెళ్తుండగా నామాపురం,అంతంపేట గ్రా మా ల ప్రజలు మర్రిగూడెం మండలానికి వెల్మకన్నె గ్రా మస్థులు పాత మండలమైన మునుగోడుకు వైద్యం కోసం వెళ్తున్నారు. అది కూడా సాధ్యం కానీ పేద ప్ర జలు గ్రామాల్లో ఉన్న చిన్నాచితక ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకుని కాలాన్ని గడుపుతున్నారు.

గతేడాదే మంజూరైన నిధులు

గట్టుప్పల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి గత సంవత్సరం అక్టోబరులో 15 ఫైనాన్స నిధు ల నుంచి 1.43 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అంతేకాక గట్టుప్పల్‌ నుంచి వెల్మకన్నె వెళ్లే దారిలో ఒకఎకరానికి పైగా స్థలాన్ని కూడా కేటాయించారు. నిధులు,భూమి ఉంది అంతేకాక ఆయా ఆరోగ్య కేం ద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి నిర్మాణం మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. దీంతో మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేసి వైద్య సేవలు అందించాలని మండలంలోని ఏడు గ్రామపంచాయతీల ప్రజలు కోరుతున్నారు.

వెంటనే పీహెచసీ నిర్మాణ పనులు చేపట్టాలి

గట్టుప్పల్‌ మండల కేంద్రంలో ప్రకటించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులు వెంట నే చేపట్టాలి. మండల కేంద్రం లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా చిన్న మండలమైన గట్టుప్పల్‌లో పీహెచసీని నిర్మించి అన్ని వసతులను కల్పించాలి.

- కర్నాటి వెంకటేశం, మాజీ జడ్పీటీసీ

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం

గట్టుప్పల్‌లో ప్రాథమిక ఆరో గ్య కేంద్ర భవన నిర్మాణ పను లు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇటీవల కాలంలోనే టెండర్ల ప్రక్రియను పూర్తయింది. సాధ్యమైనంత త్వరలో మిగతా పనులు పూర్తి చే సుకుని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శంకుస్థాపన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

- నాగేశ్వరరావు, డీఈ, పంచాయతీరాజ్‌ శాఖ

Updated Date - May 05 , 2025 | 12:32 AM