ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- బీమా ధీమా ఎప్పుడు?

ABN, Publish Date - Aug 03 , 2025 | 10:45 PM

పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అందించే ఫసల్‌ బీమా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడంతో భరోసా లేకుండా పోతు న్నది. ఆరుకాలం కష్ట పడి సాగు చేసిన పంటలు విపత్తుల కారణంగా నష్ట పోతున్నా ప్రభుత్వాలు మాత్రం రైతులను ఆదు కునేందుకు చర్యలు చేపట్టడం లేదు.

లోగో

- ఏటా అధిక వర్షాలు, వరదలతో పంటలు నష్టం

- పరిహారం అందక అన్నదాతల అవస్థలు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అందించే ఫసల్‌ బీమా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడంతో భరోసా లేకుండా పోతు న్నది. ఆరుకాలం కష్ట పడి సాగు చేసిన పంటలు విపత్తుల కారణంగా నష్ట పోతున్నా ప్రభుత్వాలు మాత్రం రైతులను ఆదు కునేందుకు చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు మృతి చెందితే రైతు బీమాను అమలు చేసి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. కానీ రైతు సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లితే మాత్రం సహాయం అందించే దాఖలాలు లేకుండా పోయాయి. కేంద్ర ప్రభుత్వం రైతులు సాగు చేసిన పంటలకు (పీఎంఎ ఫ్‌బీవై) పథకాన్ని అమలు చేస్తుండగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం పథకంలో లోపాలున్నాయని పక్క న పెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీమా పథకాన్ని పునరుద్ధరించ నున్నట్లు వెల్లడించినా ఇప్పటి వరకు క్షేత్ర స్థాయి లో స్పష్టత లేకుండా పోయింది. ప్రకృతి వైఫరీత్యా లతో నష్ట పోయే రైతులను ప్రభుత్వం పంట లకు బీమా కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

- పరిహారం దక్కక..

కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత ప్రధానమంత్రి ఫస ల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం రాష్ట్రం లో అమలులో లేకపోవడంతో రైతులకు అటు ప్రభుత్వం నుంచి ఇటు బీమా కంపెనీల నుంచి పరిహారం దక్కడం లేదు. .గతేడాది అక్టోబరులో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంట బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. కానీ పది నెలలు అవుతున్నా ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో పంటలు సాగు అవుతున్నాయి. జిల్లాలో జూలైలో కురిసిన బారీ వర్షాలు, వరదలతో ప్రాణ హిత నది పరివాహక ప్రాంతాలైన సిర్పూర్‌-టి, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్‌, దహెగాం, పెంచికల్‌పేట మండలాలలో పత్తి, కంది, ఇతర పంటలు నష్టపోయాయి. ఆయా మండలాలలో మూడు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపో యా రు. ఫసల్‌ భీమా లేకపోవడంతో ప్రకృతి వైపరీ త్యా లు ఏర్పడి పంట నష్టం జరిగినప్పుడల్లా అన్నదా తలు ఆర్థికంగా చితికి పోతున్నారు.

- తొమ్మిదేళ్ల క్రితం..

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 18, 2016న ప్రారంబించారు. ఈ పథకం ద్వారా ప్రీమియం చెల్లిం చిన రైతులకు బీమా కంపెనీలు స్వల్ప నష్టపరిహరం చెల్లించడం పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం తదితర కారణాలతో 2019లో అనేక రాష్ట్రాలు పథకం నుంచి నిష్క్రమించాయి. ఇందులో భాగంగానే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడ పథ కంలో లోపాలున్నాయంటూ ఫసల్‌భీమా యోజన పథకాన్ని పక్కన పెట్టింది. అప్పటి నుంచి రాష్ట్రంలో పంట బీమా అమలు కావడం లేదు. ఏటేటా ప్రకృ తి వైపరీత్యాలు, ఆతివృష్టి, వరదల కారణంగా అన్న దాతలు తీవ్రంగా నష్టపోతున్నా పంట పరిహారం అందడం లేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గతేడాది వానాకాల సీజన్‌లోనే ఫసల్‌ బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటిం చినా అమలుకు నోచుకోలేదు. దీంతో తాజాగా వ చ్చిన వరదలతో రైతులకు మరోసారి పంట నష్టం జరిగి ఆర్థికంగా కొలుకోలేని దెబ్బ తగిలింది. ప్రభు త్వ పంట బీమాపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవ డంతో ఈ ఏడాది కూడా బీమా నిష్ప్రయోజనం గానే మిగిలింది. మూడేళ్లుగా వానాకాలం సీజన్‌లో ఆధిక వర్షాలు కురువడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఇసుక మేటలు ఏర్పడి రైతాంగం తీవ్రం గా నష్టపోయారు. అయినప్పటికీ ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసు కోక పోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులు సాగు చేసిన పంటలు అతివృష్టి కారణంగా నష్టపోతు న్న విషయం తెలిసినా ప్రభుత్వం ఆదుకోవడం లేదని రైతులు చెబుతున్నారు.

పంటలకు బీమా అమలు చేయాలి..

- నందరామ్‌, రైతు, కోయపల్లి, చింతలమానేపల్లి మండలం

రైతులు సాగు చేస్తున్న పంటలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలి. రైతులు ఆరుకాలం కష్ట పడి అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే విపత్తుల కారణంగా నష్టం వాటిల్లుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా నేను రెండు ఎకారాల్లో సాగు చేస్తున్న పత్తి పంటలో ఇసుక మేటలు వేయడంతో నష్టం వాటిల్లింది. రైతులు సాగు చేసిన పంటలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి బీమా కల్పిస్తే భరోసా ఉంటుంది.

ఎలాంటి ఆదేశాలు రాలేదు..

- మిలింద్‌, వ్యవసాయాధికారి

పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రభు త్వం తెలిపింది. కానీ ఇప్పటివరకు పథకం అమలుపై వ్యవసాయశాఖకు ఎలాంటి సూచనలు లేవు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే రైతులకు బీమా పథకం అమలుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Aug 03 , 2025 | 10:45 PM