ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వన సంపదకు రక్షణ ఏదీ...?

ABN, Publish Date - May 30 , 2025 | 11:38 PM

జిల్లాలో అటవీ సంపదకు రక్షణ లేకుండా పోయింది. స్మగ్లర్ల గొడ్డలి వే టుకు అడవులు అంతరించిపోతుండగా, వణ్య ప్రాణుల కూ రక్షణ కరువైంది. ఒకప్పటి ఆదిలాబాద్‌ జిల్లా దట్ట మైన అడవులకు పెట్టింది పేరు. కానీ ప్రస్తుతం ఆ పరి స్థితి లేదు. ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యం, కొందరు అటవీ అధికారుల పట్టింపులేని తనంతో అత్యంత విలువైన కలప స్మగ్లర్ల గొడ్డలివేటుకు కరిగిపోతుండగా, వణ్య ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వన సంపద ర క్షణకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తు న్నా ఆశించిన స్థాయిలో ఫలితం ఉండటంలేదు.

-స్మగ్లర్ల వేటుకు అంతరించిపోతున్న అడవులు

-వణ్యప్రాణులకూ కానరాని రక్షణ

-వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్న పులులు

-ఎస్టీపీఎఫ్‌ ఏర్పాటుకు కలగని మోక్షం

-సీసీ కెమెరాలున్నా ఆగని వేట

మంచిర్యాల, మే 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటవీ సంపదకు రక్షణ లేకుండా పోయింది. స్మగ్లర్ల గొడ్డలి వే టుకు అడవులు అంతరించిపోతుండగా, వణ్య ప్రాణుల కూ రక్షణ కరువైంది. ఒకప్పటి ఆదిలాబాద్‌ జిల్లా దట్ట మైన అడవులకు పెట్టింది పేరు. కానీ ప్రస్తుతం ఆ పరి స్థితి లేదు. ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యం, కొందరు అటవీ అధికారుల పట్టింపులేని తనంతో అత్యంత విలువైన కలప స్మగ్లర్ల గొడ్డలివేటుకు కరిగిపోతుండగా, వణ్య ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వన సంపద ర క్షణకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తు న్నా ఆశించిన స్థాయిలో ఫలితం ఉండటంలేదు.

అటవీ విస్తీర్ణం ఇలా...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 7,101.30 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్త రించి ఉన్నాయి. ఆదిలాబాద్‌ డివిజన్‌లో 1898.95 చ దరపు కిలోమీటర్లు, బెల్లంపల్లి డివిజన్‌లో 1524.39, జన్నారం డివిజన్‌లో 643.74, కాగజ్‌నగర్‌ డివిజన్‌లో 893.29, మంచిర్యాల డివిజన్‌లో 1115.37, నిర్మల్‌ డివి జన్‌లో 1025.16 చదరపు కిలోమీటర్లలో అడవులు విస్త రించి ఉన్నాయి. ఇక్కడి కలపకు మంచి డిమాండ్‌ ఉం డటంతో స్మగ్లర్ల కన్ను వాటిపై పడి క్రమేపీ అడవులు పలుచబడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో లక్షా 76 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండగా, అటవీ అఽధికారులు వీటిని 195 బీట్లుగా విభజించి సంరక్షిస్తు న్నారు. ఇందుకోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీనికి తోడు వేటగాళ్లు మాంసం, చర్మం, గోళ్ల కోసం వన్యప్రాణులను విచ్చలవిడిగా వేటాడుతున్నారు. ఉమ్మ డి జిల్లాలో పెద్దపులులు, చిరుతలు మృత్యువాతపడ్డ సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అడవుల్లో సీసీ కె మెరాలు ఏర్పాటు చేసి పులులు, చిరుతల సంచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నా అవేవీ ఫలితాన్ని ఇవ్వ డంలేదు. కేవలం వణ్యప్రాణుల గణనకు మాత్రమే సీ సీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి.

గాల్లో కలుస్తున్న ప్రాణాలు....

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పులులు, చిరుతల ప్రాణాలు గాల్లో కలుస్తున్న సంఘటనలు అనేకం చో టు చేసుకుంటున్నాయి. అటవీ ప్రాంతాల్లో విద్యుత్‌ కంచెలు, ఉచ్చులు ఏర్పాటు చేసి వణ్య ప్రాణులను య థేచ్ఛగా వేటాడుతున్నారు. ఇటీవల కొమరంభీం ఆసిఫా బాద్‌ జిల్లాలో పులిని వేటాడిన స్మగ్లర్లు దాని చర్మం, గో ళ్లు తీసుకొని పాతిపెట్టారు. అటవీ అధికారులు విచా రణ జరిపి 16 మందిని అరెస్టు చేశారు. అటవీ అధికా రుల నిఘా లోపం కారణంగానే వన్య ప్రాణులు మృ త్యువాత పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పులులు, చిరు తలు మృత్యువాత పడ్డ సంఘటనలు చోటు చేసుకు న్నాయి. మంచిర్యాల నగర శివారు క్వారీ గుట్టల్లో ఏదు లు, కుందేళ్లు, సాంబారు, నీలుగాయిలు ఎక్కువగా సం చరించే వీలున్నందున అక్కడ చిరుతలు, పులుల సం చారం కూడా ఎక్కువగానే ఉంటుంది. క్వారీ గుట్టల్లో 2016లో ఉచ్చుకు చిరుతపులి చిక్కుకోగా, 2019 జవనరి 14న రంగంపేట సమీపంలో ఉచ్చులో చిరుత చిక్కి మృతి చెందింది. మృత్యుపాలైన చిరుత రోజుల తరబడి అలాగే ఉండి, శరీరం కుళ్లిపోయే దశకు చేరుకున్నా అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం.

ఎస్టీపీఎఫ్‌ ఏర్పాటుకు మోక్షం కలిగేనా...?

రాష్ట్రంలో వన్యప్రాణులు, ముఖ్యంగా పులుల రక్షణ కు ప్రత్యేక సాయుధ దళాలను ఏర్పాటు చేయాలని 2019లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ‘స్టేట్‌ టైగర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’’ (ఎస్టీపీఎఫ్‌) పేరిట ప్రత్యేక దళాలను రంగంలోకి దింపనున్నట్లు ప్రకటించింది. జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వేటకు విద్యుత్‌ కం చెను ఉపయోగించే వారిపై కేసులు నమోదు చేయా లని నిర్ణయించింది. ఆ తరహా కేసులను సత్వరం విచా రించి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకొనేం దుకు ప్రణాళికలు రచించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ లో ని కవ్వాల టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పులులు, వన్య ప్రా ణులకు రక్షణ కల్పించేందుకు 112 మంది సిబ్బందితో దళం ఏర్పాటు చేయాలని భావించింది. అసిస్టెంట్‌ క న్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నేతృత్వంలో ఈ సాయుధ ద ళం పని చేసేలా ఎస్టీపీఎఫ్‌కు రూపకల్పన చేసింది. ఇందు లో ముగ్గురు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు, 81 మంది గార్డులు, 26 మంది ఫారెస్ట్‌ వాచర్లను ఏర్పాటు చేయ నుండగా, ఈ సాయుధ దళ నిర్వహణ వ్యయాన్ని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం చొప్పున భరించే లా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే దాదాపు ఆ రే ళ్లు గడుస్తున్నా ఎస్టీపీఎఫ్‌ ఏర్పాటు చేయకపోవడంతో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్‌ ప్ర భుత్వమైనా కేంద్రంతో కలిసి ఎస్టీపీఎఫ్‌ ఏర్పాటుకు అ వసరమైన చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - May 30 , 2025 | 11:38 PM