అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:35 PM
నియోజక వ ర్గంలో అర్హులైన నిరుపేదలం దరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి తెలిపారు.
- ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి
బిజినేపల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : నియోజక వ ర్గంలో అర్హులైన నిరుపేదలం దరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని నంది వడ్డెమా న్‌లో ఆదివారం 37 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 30 మం దికిపత్రాలు అందజేసి పలువురు లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు ఆయన భూ మిపూజ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం ని రుపేదలకు ఇళ్లు ఇవ్వకుండా పదేళ్ల పాటు మా యమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్ర భుత్వం ప్రజల అవసరాల అనుగుణంగా పాల న సాగిస్తూ ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కతలప్ప, పంచాయతీ కార్యదర్శి లింగారెడ్డి, కాం గ్రెస్ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, డీసీసీ ఉపాధ్యక్షుడు బంగారి పర్వతాలు, మాజీ ఎంపీ టీసీ చంద్రశేఖర్‌రెడ్డి, రేమొదుల రమేష్, ఆ వుల రాములు, వీరశేఖరాచారి, వేమ వెంకట్రా ములు, రామకృష్ణ, రామచందర్, జయకృష్ణ, అమృత్ రెడ్డి, రాగి మధుసూదన్ రెడ్డి, నరేందర్ గౌడ్, పండ్ల పాషా, ముక్తార్, భగవంత్ గౌడ్, కత్తె ఈశ్వర్, చెన్నయ్య, ఆయా గ్రామాల మండల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 11:35 PM