ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తాం : సీఐటీయూ

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:17 AM

గ్రామపంచాయ తీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు చేపడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

ధర్నాలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తాం : సీఐటీయూ

నల్లగొండ టౌన, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయ తీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు చేపడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు. జీపీ కార్మికుల స మస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సీ ఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీపీ కార్మికులకు కనీస వేతనా లు ఇవ్వాలని, వారిని పర్మినెంట్‌ చేయాలని, ఇతర పెండింగ్‌ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎ న్నికల సమయంలో జీపీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెం టనే అమలుచేయాలని కోరారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉన్న మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, కనీ స వేతనాలు చెల్లించాలని అర్హత కలిగిన కార్మికులను పర్మినెం ట్‌ చేయాలని, ప్రమాద బీమా రూ.10 లక్షలు చెల్లించాలని, బిల్‌ కలెక్టర్‌ కారోబార్లకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. మల్టీ పర్పస్‌ పేరుతో కార్మికులను వేధించడం ఆపాలని, ఎండలు తీవ్రంగా ఉన్నందున కార్మికులతో ఒక్కపూట పనులే చేయించాలని, ఆనలైనలో లేని కార్మికుల పేర్లు వెంటనే నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యద ర్శి చింతపల్లి బయన్న, నాయకులు పొన్న అంజయ్య, పి.సర్వ య్య, ఎర్ర అరుణ, నరసయ్య, జానయ్య, రామలింగయ్య, ఎండీ. జహీర్‌, పి.చంద్రయ్య, సైదులు, మరియమ్మ, రమేష్‌, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:17 AM