ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- తిర్యాణిని అభివృద్ధి చేస్తాం

ABN, Publish Date - Jul 29 , 2025 | 11:21 PM

తిర్యాణి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. మండలం లోని జల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలో రూ.3.25 కోట్ల నిధులతో మంజూరైన బాలుర వసతి గృహాన్ని సంబందించిన శిలాఫలకాన్ని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు అనిల్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ దండె విఠల్‌

తిర్యాణి, జూలై 29(ఆంధ్రజ్యోతి): తిర్యాణి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. మండలం లోని జల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలో రూ.3.25 కోట్ల నిధులతో మంజూరైన బాలుర వసతి గృహాన్ని సంబందించిన శిలాఫలకాన్ని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు అనిల్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మండలంలోని గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడున్న సమస్యను ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటశాలను సందర్శించి పరిసరాలను గమనించారు. ముఖ్యంగా గురుకులంలో నీటి సమస్యతో పాటు డార్మేంటరీ, సమస్యలు ఉన్నట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకు రాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో అనేక సమ్యలు తిష్ట వేశాయని తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం రీజనల్‌ మేనేజర్‌తో మాటాల్డడం జరిగిందని తెలిపారు. సమస్యల పరష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో రూ.3.25 కోటలతో బాలుర వసతి గృహాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. వర్షకాలం పూర్తి తరువాత పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో అంజయ్య, ఎంపీడీవో మల్లేష్‌, నాయకులు హరీష్‌కుమార్‌, రాజు, వెంకటేశం, విజయ్‌, చిన్నయ్య, శంకర్‌, కొమురయ్య, కిష్టయ్య, అశోక్‌, లచ్చన్న, శంకర్‌, అమర్‌, తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ రేషన్‌ కార్డులు

- ఎమ్మెల్సీ దండె విఠల్‌

కెరమెరి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి పేదవారికి రేషన్‌ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. కెరమెరి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను ఎమ్మెల్సీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండె విఠల్‌ మాట్లాడుతూ అర్హత గల ప్రతి లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుదీర్ఘకాలం తరువాత నిరుదపేలకు రేషన్‌ కార్డులు అందుతున్నాయని, రేషన్‌ కార్డు పేదవారికి వరం లాంటిదని తెలిపారు. రేషన్‌ కార్డుతో రేషన్‌ కార్డులతో సన్న బియ్యం, ఆరోగ్య శ్రీ పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇంది రమ్మ ఇళ్లతో పాటు అనేక సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతారని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన పేదలకు చౌక ధరల దుకాణం ద్వారా రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యంను ఉచితంగా అందిస్తుందని, ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు. కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే మాట్లాడుతూ రేషన్‌ కార్డు దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి వెంకటి, తహసీల్దార్‌ భూమేశ్వర్‌, ఎంపీడీవో అంజద్‌పాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:21 PM